
Virupaksha Director : ప్రేక్షకులు ఒక సినిమాను హిట్ చేయాలంటే అందులో ఆకట్టుకునే కథ, కథనాలు కానీ హారర్ కానీ కామెడీ కానీ ఉండాలి.. అప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాలు పట్టం కడతారు.. మరి ఈ ఏడాది ప్రేక్షకులను థ్రిల్ చేసిన సినిమాల్లో ‘విరూపాక్ష’ ఒకటి.. ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా టాప్ లో కూడా ఉంది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”విరూపాక్ష”. తెలుగు ప్రేక్షకులు ఈ హారర్ కాన్సెప్ట్ కు ఫిదా అయ్యి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. ఏప్రిల్ 21న రిలీజ్ చేయగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓటిటిలో కూడా సాలిడ్ హిట్ గా నిలిచింది.
దీంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ వర్మ దండు పై ప్రశంసలు వెల్లువెత్తాయి.. అందరు ఈయన మొదటి సినిమా అయినా అంత బాగా చేయడంతో ఆడియెన్స్ కూడా పొగిడారు. మరి నిర్మాతలకు కూడా భారీ లాభాలను అందించడంతో డైరెక్టర్ కార్తీక్ కు టీమ్ అంతా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్నీ ఈయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
నిర్మాతలు, హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు.. దీంతో ఈ డైరెక్టర్ తెగ సంతోష పడుతున్నాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో తెలిపాడు. కొన్ని పిక్స్ షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ఈ బెంజ్ కారు ఖరీదు 70 లక్షల వరకు ఉంటుంది అని తెలుస్తుంది. మొత్తానికి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కు బహుమానం గట్టిగానే దక్కింది.