38.7 C
India
Saturday, May 18, 2024
More

    Satires on Jagan & KCR : ‘తమ్ముడు నువ్ త్యాగ జీవిరా‘.. జగన్, కేసీఆర్ దోస్తీపై సెటైర్లు

    Date:

    Satires on Jagan and KCR's friendship Goes Viral On Social Media
    Satires on Jagan and KCR’s friendship 

    Satires on Jagan & KCR :
    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు అభివృద్ధిలో పోటీపడ్డాయి. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ నేతృత్వంలోని సర్కారు అధికారంలోకి రావడం తెలంగాణ వరంగా మారిందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణలోని అధికార పార్టీ నేతలు పదే పదే ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఇదే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుపునకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో సహకరించారు. తెలంగాణ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మరి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీలో జగన్ గెలుపునకు సర్వ శక్తులు ఒడ్డారు. అర్ధ, అంగబలాలను సమీకరించారు. ఇక ఆ తర్వాత ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒక కారణమయ్యారని ఏపీ ప్రజల్లో బలంగా ముద్ర పడింది.

    ఇక ఈ అంశం నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతున్నది. జగన్, కేసీఆర్ మధ్య ఉన్న బంధాన్ని పోలుస్తూ సెటైరికల్ గా దీనిని తయారు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ తో అంటున్నట్లు ఉన్న మాటలను అందులో పొందుపరిచారు. ‘తమ్ముడు నువ్ త్యాగ జీవిరా.. నాకోసం అమరావతిని త్యాగం చేశావ్..రియల్ ఎస్టేట్ ను త్యాగం చేశావ్.. ఏపీ ఆస్తులు త్యాగం చేశావ్..ఇప్పుడు నీళ్లు త్యాగం చేస్తున్నవ్.. నీ రుణం తీర్చుకోలేనిది రా.. జన్మజన్మలకు నువ్వే నా తమ్ముడిగా ఉండాలి రా..’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.

    తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. అది వారిద్దరి వ్యాపార సంబంధాలు అని భావించే వారు ఉన్నారు. 2019 తర్వాత ఏపీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని చాలామంది ప్రముఖులు వివిధ సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. గతంలలో ఏపీలో ఒక్క ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనొచ్చు అన్నట్లు పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది తారుమారైంది. తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు అన్నట్లు తయారైంది. ఇక పలు కంపెనీలు ఏపీని వదిలి తెలంగాణ గడప తొక్కుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తెలంగాణ సీఎం, ఏపీ సీఎంను అభినందించాల్సిందే. ఇక అతి పెద్ద అమరావతి ప్రాజెక్టును కూడా ఏపీ సీఎం జగన్ తన స్వార్థం కోసం తొక్కేశారని ముద్ర వేసుకున్నారు. తాజాగా కృష్ణా జలాల్లో వాటాను కూడా ఏపీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. కృష్ణ జలాల్లో వాటా కోల్పోతే ఇక రాయలసీమ ఎడారిలా మారే ప్రమాదం ఉందని తెలిసినా, ఏపీ సీఎం జగన్ అనుకున్న స్థాయిలో స్పందించకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Viral Photo : వార్ని ఈ ఫొటోలని ఇద్దరు చిన్నారులు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలుతున్నారు కదారా..

    Viral Photo : ఈ ఫొటోలని చిన్నారులను చూస్తే ఏదో సాదాసీదాగా...

    Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

    Sita Rama : భారత సంస్కృతిలో, భారతీయుల జీవన విధానంలో సీతారాముల...

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత...