29.7 C
India
Wednesday, July 3, 2024
More

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    Date:

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు వినని భారతీయ శ్రోతలు ఉండరు. తెలుగువాడైన బాలు దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో పాటలు పాడారు. భారతీయ అగ్రశ్రేణి గాయకుల్లో ఆయనది ముందు వరుస. ఇక ఆయన తన మాతృభాష కోసం ఎనలేని సేవ చేశారు. ఆయన వాచకం అద్భుతం. ఈటీవీలో ‘‘పాడుతా తీయగా’’ కార్యక్రమం ద్వారా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న ఎంతో మంది గాయకుల ప్రతిభను ఆయన వెలికితీశారు. ‘పాడుతా తీయగా’ అనేది దేశంలోనే ఆ తరహ కార్యక్రమంలో తొలి స్థానంలో ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ సింగర్లు అంతా పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చినవారే. సంగీతకళామతల్లికి, చిత్రసీమకు, తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆ మహాగాయకుడు కరోనా మహమ్మారితో దివికేగిన విషయం ఎవరు మరిచిపోలేనిది.

    బాలును తెలుగు నేలపై ఉండే మనమే కాదు..అమెరికాలో ఉండే మనవాళ్లు నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు. బాలు జయంతి, వర్ధంతిలను నిర్వహించి ఆయనకు ఘన నివాళి అర్పిస్తుంటారు. అలాగే ‘‘ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్’’ ఆధ్వర్యంలో ప్రతీ యేడాది అమెరికాలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాయల్ అల్బర్ట్స్ ప్యాలెస్, 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్, ఫోర్డ్స్,  న్యూజెర్సీ 08863లో జూన్ 30 ఆదివారం రోజు సాయంత్రం (నిన్న) బాలు పేరిట ‘‘Grand 3rd Anniversary of SPB Music International’’ సంగీత విభావరి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి శ్రోతలను బాలు పాటలతో మైమరిపించారు.

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. పసందైన తెలుగు భోజనం కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని issi, New York Life, Novashield Assurance Partners, PN9 REALITY LLC,  MATA  స్పాన్సర్ చేశారు.

    కార్యక్రమంలో ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్   ప్రెసిడెంట్ భాస్కర్ గంటి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, సెక్రెటరీ లక్ష్మి మోపార్తి, చైర్మన్ శ్రీనివాస్ గూడూరు, వైస్ చైర్మన్ రాజేశ్వరి బుర్ర, అడ్వైజర్ దాము గెడెల తదితరులు పాల్గొన్నారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : SPB International 3rd Anniversary Celebrations

    SPB (SP Balasubramanyam) International 3rd Anniversary Celebrations

    Share post:

    More like this
    Related

    Alluri District : వందేళ్ల మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్

    Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్...

    CM CBN : రూట్ మార్చిన సీఎం సీబీఎన్.. ఇక ఏ మీటింగ్ అయినా 30నిమిషాలే

    CM CBN : ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ఇక...

    Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

    UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telugu in America : అమెరికాలో ‘తెలుగు’ వెలుగులు..అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో 11వ స్థానం!

    Telugu in America : అమెరికాలో తెలుగు వెలుగులు పంచుతోంది..జనాభాలో గణనీయమైన...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    New York : న్యూయార్క్ లో ‘కూటమి’ విజయోత్సవం..మీడియా మొఘల్ రామోజీరావుకు ఘన నివాళి..

    New York : ఏపీలో జగన్ అరాచక పాలనను అంతమొందించి టీడీపీ...