25.7 C
India
Friday, June 28, 2024
More

    Special AV on Janasena : జనసేనాని పై స్పెషల్ ఏవీ.. అదిరిపోయిందిగా..

    Date:

    Special AV on Janasena
    Special AV on Janasena

    Special AV on Janasena : ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 70వేలకు పైగా మెజార్టీతో అఖండ విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యం కల్పించారు.

    ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రిగా నియమించారు.  విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవర్ స్టార్ కు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    పవన్ అటు సినిమాలు లేదంటే రాజకీయాలతో బిజీగా ఉంటారు. కానీ ఆయన సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. చాలా కాలం నుంచి ట్విట్టర్ ఉపయోగిస్తున్న పవన్ కళ్యాణ్.. కొద్ది రోజుల క్రితమే ఇన్ స్టాలోకి ఎంటర్ అయ్యారు. ఇందులో కేవలం రాజకీయాలకు సంబంధించినవి, సినిమాల విషయాలను మాత్రమే పోస్ట్ చేస్తుంటారు.

    తాజాగా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేశారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ ఈ పదేళ్లు రాజకీయం చేశారు. ప్రజలు ఇప్పుడు ఆయన ఏదో చేస్తాడని చెప్పి అధికారం ఇచ్చారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజల సమస్యలు తీరుస్తానంటూ హామీ ఇచ్చారు.

    ఇది ఇలా ఉంటే ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వప్రసాద్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ప్రదర్శించిన ఏవీ ఆకట్టుకుంటుంది. ఎన్నో అవమానాలను, విమర్శలను ఎదుర్కొని పవన్ విజయం సాధించారని అందులో కొనియాడారు. ఆ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Ex CM Hemant Soren : భూ కుంభకోణం కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్

    Ex CM Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్...

    Prabhas : ప్రభాస్ మాటంటే మాట.. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ఫ్లాన్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ హిరో ప్రభాస్ ఇక నుంచి...

    Kalki 2898 AD : కల్కి సినిమా లో కృష్ణుడి పాత్రధారి ఇతడేనా.. వైరల్ అవుతున్న ఫొటో

    Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను  పురాణాలు,...

    Mahesh Babu : అమ్మా బాబోయ్.. మహేశ్ బాబు వేసుకున్న టీ షర్టు ధర తెలిస్తే షాక్

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు ఫిల్మ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గెలుపుతో ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన భార్య, కొడుకు..

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Janasena B Forms : రేపు జనసేన అభ్యర్థులకు బీ ఫారాలు

    Janasena B Forms : జనసేన పార్టీ తమ అభ్యర్థులకు రేపు...