Janasena B Forms : జనసేన పార్టీ తమ అభ్యర్థులకు రేపు బీ ఫారాలు అందించనుంది. జేనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా వారందరికీ బీ ఫారాలు అందించాలని పవన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో బీ ఫారాలు అభ్యర్థులకు ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టిడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో, బిజెపి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
ఈసారి ఎన్నికలు ఏపీలో రసవత్తరంగా జరుగనున్నాయి. అధికార వైకాపా ఒక్కటే పోటీలో ఉంది. టిడిపి, జనసేన, బిజెపి లు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలుస్తోంది.