32 C
India
Sunday, June 30, 2024
More

    TDP Alliance Victory : పక్కా గెలిచేది టీడీపీ కూటమే..విశ్వసనీయ సర్వే సంస్థ వెల్లడి

    Date:

    TDP Alliance Victory
    TDP Alliance Victory

    TDP Alliance Victory : ఈ మధ్య కాలంలో 95శాతం పైగా కచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన సంస్థ ‘యాక్సిస్‌ మై ఇండియా’. శనివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే అధికారమని తేల్చింది.  ‘ఇండియా టుడే చేసిన సర్వే కూడా ఏపీలో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించిన తర్వాత ఈ సంస్థ ఆదివారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల అంచనాలను కూడా తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో కూటమే గెలుస్తుందన్న ఈ సర్వే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమే గెలుస్తుందని పర్యటించింది.  ఎన్డీయే కూటమి 51శాతం ఓట్లతో 98-120 స్థానాల్లో గెలుస్తుందని, వైకాపా 44శాతం ఓట్లతో 55-77 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది.  కాంగ్రెస్‌ 2శాతం ఓట్లతో 0-2 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది.  ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమే గెలుస్తుందని తేల్చాయి.

    గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి వైసీపీ 85 స్థానాలు కోల్పోతుందని.. ఆ స్థానాలు ఎన్డీయే కూటమికి వస్తాయని ‘ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా’ సర్వే అంచనా వేసింది. టీడీపీ 78-96 స్థానాల్లో, జనసేన 16-18 స్థానాల్లో, బీజేపీ 4-6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పథకాలు 22శాతం, ప్రభుత్వ పనితీరు 9శాతం, అభివృద్ధి 18శాతం, పార్టీ అనుకూలత 12శాతం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపాయని తేలింది.   ఎన్టీయే కూటమికి పురుషులు 54శాతం, మహిళలు 48శాతం.. వైకాపాకు పురుషులు 41శాతం, మహిళలు 47శాతం మంది మద్దతు పలికినట్లు సర్వే వెల్లడించిందిజ సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చిచూస్తే పురుషుల్లో 10శాతం, మహిళల్లో 2శాతం ఓట్లను వైసీపీ కోల్పోయే ఛాన్స్ ఉందంది.

    18-25 ఏళ్ల యువతలో 57శాతం మంది ఎన్డీయేకు మద్దతు పలికారు. వైసీపీకి  39శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. 26-35 ఏళ్లవారిలో 52శాతం ఎన్డీయేకు, 43శాతం వైసీపీకి మద్దతిస్తారు. 36-50 ఏళ్లవారిలో 49శాతం  ఎన్డీయేకు, 46శాతం వైసీపీకు ఓట్లేశారు. 61 ఏళ్ల పైబడిన వారిలో వైకాపాకు 49శాతం, ఎన్డీయేకు 46శాతం మద్దతు పలికారని సర్వే వెల్లడించింది.  ఓట్లు, సీట్ల అంచనాలతో పాటు రాష్ట్ర ప్రజల మనోగతంపైనా ఈ సర్వే దృష్టిసారించింది. గెలుపోటములను నిర్దేశించే అంశాలను విశ్లేషించింది.

    Share post:

    More like this
    Related

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    Suryakumar Yadav : కప్పు తెచ్చిన క్యాచ్.. కపిల్ ను గుర్తు చేసిన సూర్య

    Suryakumar Yadav : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Eluru District : వైసీపీ గెలుస్తుందని పందెం.. రూ.30 కోట్లు చెల్లించలేక ఆత్మహత్య

    Eluru District : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని సుమారు రూ.30...

    Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఊహించని పదవులు..

    Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు...

    YSRCP : గెలిస్తే సక్రమం.. ఓడితే అక్రమం.. ఇది వైసీపీ తీర్పు 

    YSRCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో అసెంబ్లీ ఎన్నికలు...

    Pawan Kalyan-Balayya : పవన్ కు బాలయ్యకు ఎవరికీ మెజార్టీ ఎక్కువో..

    Pawan Kalyan-Balayya : పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మార్గాని భరత్, లోకేశ్...