Maheshbabu : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఈ మూవీలో మహేశ్ బాబు, వెంకటేష్ లు స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. భారీ అంచాల మధ్య రిలీజైన ఈ సిని0మా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో మహేశ్ బాబు, వెంకటేశ్ మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. ఇంటి బాధ్యతలు పంచుకుంటూనే లవర్ బాయ్ గా కూడా అలరించాడు మహేశ్ బాబు.
మహేశ్ బాబు సిటీ నుంచి గ్రామానికి వచ్చే సీన్ గుర్తుందా? ట్రైన్ దిగి వస్తున్న మహేశ్ బాబు ఒక అమ్మాయిని ఫ్లట్ చేసేందుకు ట్రై చేస్తాడు. ఆ సమయంలో అన్న వెంకటేశ్ రావడంతో ఫిరాయిస్తాడు. అలా వచ్చి ఇలా వెళ్తుంది ఈ అమ్మాయి. ఆమెను ఎక్కువగా ఎవరూ గుర్తుంచుకోలేరు. కానీ ఆ అమ్మాయి చాలా ఫేమస్ ఆమె గురించి తెలుసుకుందాం.
ఆమె పేరు సుప్రియ ఐసోలా. తెలుగులో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. చాలా సంప్రదాయంగా కనిపించే ఈ అమ్మాయి ‘బాబు బాగా బిజీ’లో బోల్డ్ క్యారెక్టర్ కూడా వేసింది. ఆ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపు వెళ్లింది.
హిందీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటిస్తూ అక్కడే స్థిరపడింది. సుప్రియ ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో కీలక పాత్రను పోషించింది. ఇందులో ఆమెను చూసిన చాలా మంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో చేసింది ఈ అమ్మాయేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.