32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Fish Medicine : చేపమందు పంపిణీలో విషాదం.. తోపులాటలో ఒకరి మృతి

    Date:

    Fish Medicine
    Fish Medicine

    Fish Medicine : మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు.. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. చేప ప్రసాదం తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలున్న బాధితులు తరలివచ్చారు. అయితే.. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైన కాసేపటికే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేప ప్రసాదం కోసం పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో క్యూలైన్‌లలో తోపులాట జరిగింది. అయితే.. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57).. ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్‌లో నిలబడి ఉండగా.. రద్దీ పెరిగి క్యూలైన్‌లో జరిగిన తోపులాటతో స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన సిబ్బంది.. అతన్ని హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు.

    చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చేప ప్రసాదం పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేయగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఉపశమనం దొరుకుతుందని ప్రజల నమ్మకం.

    Share post:

    More like this
    Related

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ వద్ద బాధితుల ఆందోళన

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లో భారీ...

    Hyderabad : హైదరాబాద్-కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య.. 3 గంటలు గాలిలోనే చక్కర్లు

    Hyderabad-Kuala Lumpur Flight : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా...

    Fake Police : నకిలీ పోలీస్.. రూ. 10 లక్షలు వసూలు

    Fake Police : లగ్జరీ లైఫ్, గుర్రప్పందాలు, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్...

    Cyber Crime : దావూద్ తో సంబంధం ఉందని.. రూ.20 లక్షలు కొట్టేశారు..

    Cyber Crime : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇడ్రహీంతో సంబంధాలు...