
Kushi Trailer టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల తాను నటించిన సినిమాలు డిజాస్టర్ కావడంతో హిట్ కోసం తాపత్రయపడుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన సినిమా ఖుషి సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆకట్టుకునే విధంగా ఉందని అందరు కామెంట్లు పెడుతున్నారు.
నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాలు నిర్మించిన శివ నిర్వాణ ఖుషి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. టర్కీ సహా పలు దేశాలు, ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. టైటిల్ సాంగ్, నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలకు సూపర్ క్రేజీ ఏర్పడింది. ఇందులో సమంత ముస్లిం యువతిలా కనిపిస్తుంది. పోస్టర్ కు ఆదరణ పెరిగింది. విజయ్, సమంత రొమాంటిక్ పోజు ఆకర్షిస్తోంది. వారి రొమాన్స్ సినిమాకు ప్లస్ కానుందని చెబుతున్నారు. వారి రొమాన్స్ చూస్తుంటే సినిమా మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు.
ఆగస్టు 9న ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఖుషి ట్రైలర్ రెండు నిమిషాల 41 సెకన్ల నిడివి ఉంది. విప్లవ్, ఆరాధ్య పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని బాండింగ్ కోసం ఎదుర్కొనే సమస్యలను ట్రైలర్ లో చూపించారు. జయరాం, మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, ఆలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామక్రిష్ణ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించింది. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఖుషి సినిమా మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, సమంతకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖుషి ఏ మేరకు విజయం సాధిస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఖుషి సినిమాలో వీరి రొమాన్స్ అందరికి కనువిందు చేస్తుందని పలువురు నమ్ముతున్నారు.