25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Date:

    Virat Kohli
    Virat Kohli

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బార్బడోస్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి అర్ధ సెంచరీ చేసి భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాతే కోహ్లీ టీ-20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్ తన చివరి T20 మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

    టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీని తర్వాత కోహ్లి బాధ్యత తీసుకొని భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు విరాట్. ఇక  టీ-20 ఫార్మాట్ క్రికెట్‌లో ఆడే అవకాశం కనిపించడం లేదు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో, విరాట్ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

    మ్యాచ్ గెలిచిన అనంతరం “తాము సాధించాలనుకున్నది ఇదే” అని కోహ్లీ చెప్పాడు. భారత్ తరఫున ఆడుతున్న ఇదే నా చివరి టీ20 మ్యాచ్. మేము ఆ కప్పును అందుకోవాలనుకున్నాం.. సాధించాం. దేవుడు చాలా గొప్పవాడు.. కీలకమ్యాచ్లో జట్టును గెలిపించే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. భారత్‌కు ఇదే నా చివరి టీ20.  ఐపీఎల్‌లో మనం చూసినట్లుగానే తర్వాతి తరం టీ20 ఆటను ముందుకు తీసుకెళ్లి అద్భుతాలు సృష్టించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు.  అలాగే విరాట్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాడని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాం లేదని చెప్పాడు. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి మాకు చాలా కాలం పట్టింది. ఇది నా ఆరో ప్రపంచకప్. ఇకపై ఈ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున ఆడను అని పేర్కొ్న్నాడు.
    ఈ మ్యాచ్ లో విరాట్ 59 బంతుల్లో(6 ఫోర్లు, 2 సిక్స్ లు) 76 పరుగులు చేశాడు. తన అసాధారణ బ్యాటింగ్ తో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్ గా నిలిచాడు. అవార్డు అందుకున్న అనంతరం తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : హరికేన్ ఎఫెక్ట్.. బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీం ఇండియా

    Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు...

    Suryakumar Yadav : సూర్య కుమార్ యాదవ్, అతడి భార్య చేసిన పని చూస్తే ఫిదా కావాల్సిందే

    Suryakumar Yadav : సూర్య కుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...