Ramoji rao ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు 1962 వ సంవత్సరంలో ‘మార్గదర్శి’ అనే పేరుతో ఒక చిట్ ఫండ్స్ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఎంతో మందిని చందాదారులుగా చేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. దేశంలోనే పేరుగాంచిన పెద్ధ చిట్ ఫండ్ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఈ కంపెనీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలతో విస్తరించింది. 4వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో 3లక్షల కంటే ఎక్కువ చందాదారులను కలిగి ఉన్న అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. కానీ ఖాతాదారుల నిధులు మళ్ళించారనే అభియోగం తో మార్గదర్శి పై కేసు నమోదైంది.
కానీ మార్గదర్శి లో ఖాతాదారులు చిట్స్ మెదలు పెట్టే క్రమంలో నింపే ఫారమ్ నుంచి చిట్స్ పూర్తి అయ్యాక ఉపసంహరించుకునే సమయం వరకు ప్రతీది చాలా పకడ్భందీ గా పేపర్ వర్క్ జరుగుతుందని మార్గదర్శి నిర్వాహకులు తెలుపుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మార్గదర్శి లో నిధులు మళ్ళింపు జరిగిందనీ ఆరోపిస్తుంది.
అయితే ఏపీ ప్రభుత్వం కథనం ప్రకారం మార్గదర్శికి తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోను బ్రాంచి ఆఫీస్ లు ఉన్నాయి. హెడ్ ఆఫీస్ మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ లో ఉంది. బ్రాంచి కార్యాలయాలలోని నిధులను ప్రధాన కార్యాలయానికి చేర్చినట్లు తెలిపింది. ఈ భారీ మొత్తంను మ్యూచ్‌వల్ ఫండ్ లలోనే కాకుండా అనేక లాభదాయక పెట్టుబడులలో ఉపయోగించినట్లు తెలిపింది. కానీ ఇలా ఖాతాదారుల సొమ్మును ఒక బ్రాంచి నుంచి ప్రధాన బ్రాంచికి మార్చడం చాలా పెద్ద నేరంగా భావించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శి పై ఏడు కేసులు పెట్టింది. నిందితులలో గ్రూప్ చైర్మన్ సి రామోజీ రావు మరియు అతని కోడలు సి శైలజా కిరణ్ పేర్గను కూడా చేర్చింది.
దీనికి ప్రతిగా మార్గదర్శి నిర్వాహకులు స్పందించారు. సహజంగా ఏ కంపెనీ అయినా ఆ కంపెనీ పొందిన లాభాలను మ్యూచ్‌వల్ ఫండ్స్ లలో పెట్టుకుంటుంది. కానీ ఆరోపణల ప్రకారం మార్గదర్శి తన ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బును మొత్తం ఎక్కడా కూడా పెట్టుబడి రూపంలో ఉపయోగించలేదని తెలిపింది. కేవలం కంపెనీ కి వచ్చిన లాభాలలో కొంత మాత్రమే పెట్టుబడి పెట్టామనీ, నిబంధనలకు లోబడి మాత్రమే నడుచుకున్నామని మార్గదర్శి కంపెనీ వారు చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు లో మార్డదర్శి పై కేసు విచారణ లో ఉంది. ఈ కేసు విచారణ పూర్తయి మార్గదర్శి కి క్లీన్‌చీట్ ఇస్తేనే అందులోని ఖాతాదారులు కొంత ఊపిరి పీల్చుకుంటారని పలువురు తెలుపుతున్నారు.