26.3 C
India
Thursday, July 4, 2024
More

    YCP Another Mistake : వైసీపీ మరో తప్పు చేస్తుందా.. ఆ ప్రజల తరుఫున ఎవరు పోరాడాలి?

    Date:

    YCP Another Mistake
    YCP Another Mistake

    YCP Another Mistake : రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వ సాధారణం. గెలిస్తేనే సేవ చేస్తాం. అది కూడా సీఎం, మంత్రుల లాంటి పదవులు ఉంటే తప్ప సేవ చేయం అనడం మంచిది కాదు. వైసీపీ తీరు ప్రస్తుతం అలాగే కనిపిస్తుందని ఏపీ ప్రజలు వాపోతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. నిన్న (జూన్ 21) ఏదో వచ్చాం అంటే వచ్చాం.. అంటూ వచ్చిన జగన్ ఈ రోజు (జూన్ 22) స్పీకర్ ను ఉద్దేశించి సభా కార్యక్రమం ఉంది. స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత పాలక పక్షానికి ఎంతో ప్రతిపక్షానికి కూడా అంతే. 11 సీట్లు వచ్చినా, వైసీపీ ప్రతిపక్షం కాబట్టి ఆ పార్టీ తన బాధ్యతను నిర్వర్తించాలి. కానీ జనగ్, 10 ఎమ్మెల్యేలు సభకు రాలేదు. దీంతో బాధ్యతల నుంచి పార్టీ పారిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    ‘అయ్యన్న’కు అవమానం..

    అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నిన్న (జూన్ 21) నామినేషన్ వేశారు. అత్యధికంగా 8 సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రిగా, మరో సారి పార్లమెంట్ కు ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ పదవికి ఒక్క నామినేషనే రావడంతో ఏకగ్రీవమైంది. ఇవాళ ఆయనను గౌరవంగా సభాపతి సీటులో కూర్చోబెడతారు. సంప్రదాయం ప్రకారం.. ఈ పని ప్రతిపక్షమే చేయాలి. ఎందుకంటే.. స్పీకర్ సహజంగానే అధికార పార్టీకి చెందిన వ్యక్తి. అయితే, ఆయన పాత్ర మాత్రం రాగద్వేశాలకు అతీతంగా పాలక పక్షం, ప్రతిపక్షాన్ని సమానంగా చూస్తారు కాబట్టి. స్పీకర్‌కు ఆ గౌరవం ఇస్తూ ప్రతిపక్షం ఈ సంప్రదాయం పాటిస్తుంది. కానీ వైసీపీ దానికి మంగళం పాడింది. దీన్ని బట్టి చూస్తే ముందు ముందు ఆ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్పీకర్‌నే గౌరవించని వైసీపీ.. సభలో బాధ్యతగా ఎలా వ్యవహరిస్తుందా? అనే డౌట్ రాజకీయ వర్గాల్లో వస్తోంది.

    అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ తనకేమీ పట్టనట్టు పులివెందులకు వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న సమయంలోనే ప్రజల తరఫున ప్రతిపక్షంగా జగన్ ప్రశ్నించాలి. ఈ బాధ్యతను మరచి పులివెందులకు వెళ్లాలనుకోవడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వెళ్లచ్చుగా అని టీడీపీ నిలదీస్తుంది. ఎన్నికలకు ముందు ఎన్ని రాజకయాలైనా చేయవచ్చు గాక.. కానీ అన్నీ ముగిశాక ప్రజల కోసం పని చేయాలి. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ఇలా పంతాలకు పోయి బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Kavitha : కవితకు జైలు నుంచి విముక్తి దొరకదా..?

    Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు నెలల...

    CM Chandrababu : ఏపీవాసులకు శుభవార్త.. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    Mandhana-Shafali : సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన మంధాన-షఫాలీ.. దిగజారిన  దక్షిణాఫ్రికా  పరిస్థితి 

    Mandhana-Shafali : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య...

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : బిల్లుల పోరు పడలేక బెంగుళూరు చెక్కేసిన వైసీపీ అధినేత

    YS Jagan : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి...

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    YCP MLA’s Chanting : వైసీపీ ఎమ్మెల్యేల భజన.. అసెంబ్లీలో జగన్ నవ్వులే నవ్వులు

    YCP MLA's Chanting : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది....

    AP Assembly : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ.. నేడు మంత్రివర్గ భేటీ.. కీలక అంశాలపై చర్చ

    AP Assembly : ఏపీలో గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...