health : మనకు మాంసాహారం కంటే శాఖాహారంలోనే బలం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువగా మాంసాహారం తీసుకోవడానికే ఇష్టపడుతుంటాం. వారంలో కనీసం రెండు మూడు రోజులు నాన్ వెజ్ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో శాఖాహారంలో మనకు కూరగాయల వల్ల అనేక పోషకాలు అందుతాయి. ఇందులో బెండకాయ ఎంతో పుష్కలమైన ప్రొటీన్లు ఉన్న ఆహారం. దీంతో బెండకాయను చాలా మంది ఇష్టంగా తింటారు. రుచితోపాటు మన ఆరోగ్యం మెరుగుకు ఇది ఎంతో దోహదపడుతుంది.
బెండకాయ కొన్ని జబ్బులు ఉన్న వారు తినకూడదు. కిడ్నీ జబ్బులు ఉన్న వారు బెండకాయలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు కూడా బెండకాయ జోలికి వెళ్లకపోతేనే మంచిది. కిడ్నీల్లో రాళ్లు, పిత్తాశయంలో రాళ్లు ఉన్న వారు బెండకాయ తినొద్దు. ఈ సమస్యలతో బాధపడేవారు బెండకాయలను తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.
పూర్వం రోజుల నుంచి బెండకాయ తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని అంటారు. లెక్కలు బాగా వస్తాయని కూడా అంటుంటారు. సైనస్ సమస్యతో బాధపడేవారు కూడా బెండకాయలకు దూరంగా ఉంటేనే మంచిది. చల్లని వాతావరణంలో బెండకాయలు తినొద్దు. ఇందులో ఉండే పీచు వల్ల డయేరియా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో బెండకాయలను ఈకాలంలో దూరం పెట్టాలి.
బెండకాయ వేయించేటప్పుడు అధికంగా నూనె వాడటం కూడా మంచిది కాదు. దీంతో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఇబ్బందులు కలిగే వీలుంటుంది. ఇలా బెండకాయలను కిడ్నీ జబ్బులు ఉన్నవారు తినడం వల్ల ముప్పు ఏర్పడుతుంది. వైద్యుల సలహా మేరకు బెండకాయలను తినేందుకు ఇష్టపడాలి. అంతేకాని ఇష్టమొచ్చినట్లుగా తింటే మనకు నష్టాలే వస్తాయి.