
బ్రిటన్ ప్రధాని పదవికి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ అనూహ్యంగా మళ్ళీ పుంజుకున్నారు . ప్రధాని పదవి రేసులో ముందు నుండి కూడా ముందంజలో ఉన్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఎక్కువగా ఉంది రిషి సునాక్ కు మాత్రమే ! అయితే పార్టీ సభ్యులు మాత్రం ఎక్కవగా లిజ్ ట్రస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో విజయం దోబూచులాడుతోంది.
కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య 1,75,000 గా ఉంది. దాంట్లో ఎక్కువగా ఎవరు ఓట్లను సాధిస్తారో వాళ్ళు సెప్టెంబర్ 5 న బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నిక అవుతారు. అయితే ఇటీవల రౌండ్ లలో రిషి సునాక్ వెనుకంజలో ఉండేది. తాజాగా రిషి పుంజుకున్నారు. పార్టీ సభ్యులకు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ఆదేశాలు జారీ చేశారట. లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని కావాలని , రిషి సునాక్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానిగా అంగీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టాడట. దాంతో రిషి బ్రిటన్ ప్రధాని అవుతారా ? లేదా ? అనే టెన్షన్ నెలకొంది.