- 2 వేల కోట్లు నష్టపోయిన రిషి సునాక్ దంపతులు…

Rishi Sunak couple : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షత మూర్తి సంపాదనపై చర్చ జరగుతోంది. బ్రిటన్ లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న ఆరోపణలు ఇటీవల దేశలో గుప్పు మంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని నెలలుగా సునాక్ దంపతుల ఆస్తి భారీగా క్షీణించిపోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 12 నెలల్లోనే వీరి సంపదలో దాదాపు 200 మిలియన్ పౌండ్లు (రూ. 2,069 కోట్లు) కోల్పోయారట. అంటే రోజూ సుమారు 5లక్షల పౌండ్లు కోల్పోతున్నట్లు లెక్క.
అయతే బ్రిటన్ లో సండే టైమ్స్ ఇటీవల ఒక మ్యాగజిన్ ను విడుదల చేసిందట. అందులో సునాక్ దంపతులు 275వ స్థానంలో కొనసాగుతున్నట్లు సంస్థ ప్రచురించింది. గతంలో 222వ స్థానంలో ఉన్న వారు 275కు పడిపోయారు. అయితే ఈ క్షీణత ఏడాది కాలంలోనే కనిపించిందట. ఇందుకు ఇన్ఫోసిస్ షేర్ల పతనమే ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అని అందరికీ తెలిసిందే.. ఇన్ఫోసిస్ లో సునాక్ భార్య అక్షతా మూర్తికి 64 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. సంస్థ మొత్తం షేర్లలో ఇది కేవలం ఒక శాతం మాత్రమేనట. అయితే గతేడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోతుండడంతో సునాక్ దంపతుల సంపద కూడా పడిపోతున్నట్లు నివేదికలు తెలిపాయి.
అయితే బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్న సునాక్ కు జీత భత్యాల కింద ఏడాదికి 1.65 లక్షల పౌండ్లు సమకూరుతాయి. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి వారి సంపద 730 మిలియన్ పౌండ్లక చేరుకుంది. అయితే ఇటీవల మార్కెట్ల పతనం, ద్రవ్యోల్బనంతో వారి సంపద 529 మిలియన్ పౌండ్లకు ( 66.8 కోట్ల డాలర్లు) పడిపోయింది.