
తెలంగాణ ప్రభుత్వానికి 900కోట్ల జరిమానా విధించింది ఎన్జీటీ. పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు – రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 900 కోట్ల జరిమానా విధించింది. ఈ 900 కోట్ల రూపాయలను మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను కేఆర్ఎంబి వద్ద జమ చేయాలని ఆదేశించింది.
పాలమూరు – రంగారెడ్డి , డిండి ప్రాజెక్ట్ లకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం కోర్టు కెక్కడంతో చెన్నై ఎన్ జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
దాంతో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంభించనుంది అనే టెన్షన్ నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వ అధికారులను పర్యవేక్షకులుగా నియమించింది ఎన్జీటీ.