
మనం జ్యోతిష్యాన్ని నమ్ముతాం. గ్రహాల ప్రకారం ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది? ఏం చేయాలి? అనే విషయాలపై లెక్కలతో సహా రాసి ఉంటాయి. అందుకే మనం జ్యోతిష్యాన్ని విశ్వసిస్తాం. మనకు భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది గ్రహాల ఫలితాలు తెలియజేస్తాయి. గురు గ్రహం ఫలితంగా మనిషి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వివరిస్తుంది.
గ్రహాలు అనుకూలంగా లేకపోతే ప్రభావాలు ప్రతికూలంగా వస్తాయి. ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుంటే సరి. ధనుస్సు రాశి వారికి అనుకూల ప్రభావాలే కలిగిస్తున్నాయి. ఎలాంటి పనులు చేపట్టినా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు పురోగతి సాధిస్తారు. కోరుకున్న పనులు నెరవేరతాయి.
మీన రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. గురు ధనుస్సు రాశి తరువాత ఈ రాశి వైపే చూస్తున్నాడు. అందుకే వీరు ఏం చేసినా లాభాలు వస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. లాభాలు చేతికి అందుతాయి. ఈ రాశి వారు కోరుకున్నది జరుగుతుంది.
జ్యోతిష్యం ప్రకారం ఈ రెండు రాశుల వారికి మంచి ఫలితాలు దక్కనున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే. అన్ని మంచి శకునాలే ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాశుల వారికి శుభవార్తలు వినబడనున్నాయి. ఇలా ఈ రెండు రాశులకు మంచి కాలం రానుంది.