17.2 C
India
Wednesday, November 30, 2022
More

  రాశిఫలాలు మే 30 నుండి జూన్ 5 వరకు

  Date:

  horoscopes-may-30th-to-june-5th
  horoscopes-may-30th-to-june-5th

  మేషం :

  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు , సంఘంలో గౌరవం ఆస్థి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్ధిక విషయాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిమ్మల్ని మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో లాభాలు కలిసి వస్తాయి. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాహన యోగం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధనవ్యయం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్త్రోత్రాలు పఠిస్తే మంచిది.

  వృషభం :

  ఆర్ధిక విషయాలలో ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యమైన పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. భూమి , వాహనం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం , ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో వివాదాలు కొంత చికాకు పెడతాయి. పారిశ్రామిక రంగాల వారికి కొంతవరకు మంచి ఫలితాలే వస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామధ్యానం చేస్తే మరిన్ని ప్రయోజనాలు.

  మిథునం :

  అవసరాలకు ఆర్ధిక సహకారం అందుతుంది. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. బంధు మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దు. వాహనం , గృహం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు మంచి కాలం. ఉద్యోగులు కలిసి వస్తుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు సైతం కలిసి వచ్చే అవకాశం. వారం మధ్యలో ధనవ్యయం అలాగే స్వల్ప వివాదాలు కూడా. తూర్పు వైపు ప్రయాణాలు అనుకూలం. వెంకటేశ్వరస్తుతి మంచి చేస్తుంది.

  కర్కాటం :

  దీర్ఘకాలిక ఋణబాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులలో విజయం , ఆర్థికంగా కలిసి వస్తుంది . ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహన యోగం , గృహ యోగం కూడా ఉంది. వ్యాపారాలలో ఉబ్బందులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పని భారం తగ్గుతుంది. కళారంగంలో ఉన్నవాళ్లకు మరిన్ని అవకాశాలు వస్తాయి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు. ఉత్తర దిశ ప్రయాణం అనుకూలం. సుబ్రహమణ్యాష్టకం పఠిస్తే మంచిది.

  సింహం :

  ఉత్సాహంతో ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో కలిసి వస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి కలిసి వచ్చే అంశం. ఉద్యోగులకు అదనపు భారం తగ్గుతుంది. వారం మధ్యలో ధనవ్యయం , కుటుంబంలో చికాకులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.

  కన్య :

  పలుకుబడిన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. వస్తులాభం , ఆస్థి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఒక ఊరట లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అంశం. ఉద్యోగస్తులు పొరబాట్లు సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. కళారంగంలో ఉన్నవాళ్లకు కలిసి వచ్చే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో విబేధాలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచి జరిగే అవకాశం.

  తుల :

  ఆర్ధిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలలో పొరపాట్లని సరిచేసుకునే అవకాశం. ఆస్థి విషయాలలో సోదరులతో విబేధాలు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సాగవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యత తప్ప ప్రయోజనం ఉండదు. శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం కలిసి వచ్చే అంశం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది.

  వృశ్చికం :

  ప్రధాన సమస్యలు తీరతాయి, ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగు అవుతుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్వగృహ నిర్మాణానికి పూనుకుంటారు. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కళారంగంలో ఉన్నవాళ్లు ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యారస్థులకు కలిసి వచ్చే అంశం. ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వారం చివర్లో సమస్యలు. ఆరోగ్య భంగం , మానసిక అశాంతి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహ స్త్రోత్రం పఠించండి.

  ధనుస్సు :

  కొత్త ఋణ యత్నాలు చేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు సమస్యని సృష్టిస్తుంది. బంధుమిత్రులతో స్పల్ప విబేధాలు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి , మరిన్ని బాధ్యతలు . పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహమే ఎదురు అవుతుంది. అయితే వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహా విష్ణు షోడశనామ స్తుతి పఠిస్తే మంచిది.

  మకరం :

  తోడబుట్టిన వాళ్లతో విబేధాలు తీరతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తి కరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు చేతికందుతాయి. వాహనయోగం ఉంది , గృహనిర్మాణం చేపడతారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగంలో మీదే పైచేయి. కళాకారుల అంచనాలు ఫలించే సమయం. వారం మధ్యలో ఆస్థి వివాదాలు . కలహాలు , అనారోగ్య భంగం. తూర్పు దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీ సూర్య ప్రార్థన చేస్తే మంచిది.

  కుంభం :

  రావలసిన సొమ్ము చేతికందుతుంది. మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ , ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు పోయి కొత్త పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ వర్గాల్లో కొంత ఊరట. వారం ప్రారంభంలో చికాకులు , స్వల్ప అనారోగ్యం. పశ్చిమ దిశ ప్రయాణం అనుకూలం. హయగ్రీవ ధ్యానం చేయండి మంచిది.

  మీనం :

  ఆస్తుల విషయంలో సమస్యలు తీరతాయి. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పాత బాకీలు వసూల్ అవుతాయి. శుభకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు , వ్యాపారులకు మంచి కాలం. రాజకీయవర్గాలకు కలిసి వచ్చే కాలం. వారంమద్యలో ఒత్తిడులు . అనారోగ్యం ,ఉత్తర దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. సుబ్రమణ్య స్తుతి చేయడం మంచిది. 

  Share post:

  More like this
  Related

  చంద్రముఖి 2 లో హాట్ భామ

  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సంచలన చిత్రం '' చంద్రముఖి...

  ఆలీ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

  ప్రముఖ నటులు , ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ కూతురు...

  సద్దుమణిగిన సమంత యశోద వివాదం

  స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద పై తీవ్ర దుమారం చెలరేగిన...

  వైయస్. విజయమ్మ గృహ నిర్బంధం

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ను తెలంగాణ...

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  రాశిఫలాలు (మే 23 నుండి మే 29 వరకు)

  మేషం :ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ముఖ్య...