29.3 C
India
Wednesday, June 26, 2024
More

    Chandra Babu : బ్లాక్ గాగుల్స్ లో బాబుగారూ అద్దిరిపోయారు.. మహిళా అభిమాని ఆనందానికి హద్దే లేదు..

    Date:

    Chandra Babu
    Chandra Babu

    Chandra Babu : ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సాధించని విజయాలను ఈ సారి చవి చూసింది. జనం ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ఒక్కటై సైకిల్ కు జనాలు జై కొట్టారు. ఎస్సీ నియోజకవర్గాల్లో సహజంగా తొలి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉండేది. అయితే ఇప్పుడు ఆ చరిత్రను టీడీపీ తిరగరాసింది. ఒకటంటూ ఏమీ లేదు. అసలు అభ్యర్థులను చూడలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఓటర్ల బటన్ నొక్కారని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ సాధించలేదు.

    చంద్రబాబు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నారు. కూటములను ఏర్పాటుచేశారు. అయితే ఎప్పుడూ ఈ స్థాయి విజయాన్ని అందుకోలేదు. అంతటి విజయం వస్తుందని బహుశ ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రభుత్వంపై చాపకిందనీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల తర్వాతే అర్థమైంది. విశ్లేషకులకు సైతం అంతుపట్టకుండా జనం నాడి ఉందని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇది పాలకులకు ఒక గుణపాఠం అనే చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఓటమి పాలయితే తక్కువ మెజార్టీతో ఓటమి పాలు కావడం, తక్కువ ఓట్లతో తృటిలో అధికారాన్ని కోల్పోవడాన్ని ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ  గతంలో ఎన్నడూ రానంత భారీ మెజారిటీలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టారు.

    సింహాసనం అధిష్ఠించిన చంద్రబాబును కలిసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. సీఎం పదవి చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆయనను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళ ఇచ్చిన గిఫ్టు స్వీకరించిన బాబును చూసి ఆమె పట్టరాని ఆనందంలో మునిగిపోయింది. ఓ మహిళ చంద్రబాబు బ్లాక్ గాగుల్స్ బహుమతిగా అందించింది. అది పెట్టుకుని చంద్రబాబు ఆమె కోరిక తీర్చారు.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా అయ్యన్న పాత్రుడు

    AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా...

    Chandra babu : అందుకే అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా : చంద్రబాబు

    Chandra babu : గతంలో ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సతీమణి...

    Motkupalli Narasimhulu : ఏపీ సీఎంను చూసి ఇతర సీఎంలు నేర్చుకోవాలి: మోత్కుపల్లి  నర్సింహులు

    Motkupalli Narasimhulu : ఇతర సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబును చూసి...

    Chandrababu : జగన్ అప్పులకుప్ప చేసి వెళ్లాడు..చంద్రబాబుకు సవాల్ గా మారనుందా?

    Challenges to Chandrababu : ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి...