28.2 C
India
Saturday, May 18, 2024
More

    Worst Record In Cricket History : ఒక్క బాల్.. 18 పరుగులు.. క్రికెట్ హిస్టరీలనే ఇదో చెత్త రికార్డు

    Date:

     

    Cricket
    Cricket

    Worst Record In Cricket History : ఒక ఓవర్లో 18 పరుగులు ఇస్తేనే తిట్టిపోస్తారు.. అలాంటిదే ఒకే బాల్ కు 18 పరుగులు ఇచ్చి క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు సృష్టించాడు ఓ బౌలర్. సమయం మనది కాకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కోసారి బ్యాట్స్ మెన్ కొట్టే కొట్టుడికి బౌలర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక ఆఖరి ఓవర్లో అయితే ఇక చెప్పనక్కరలేదు. రాంగ్ బాల్ తో జట్టు ఓడిపోతే ఆ బౌలర్ కు ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లు ఉంటుంది. ట్వీ20 వచ్చాక బౌలర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వికెట్లు పడితే ఓకే గాని ఇక బ్యాట్స్ మెన్ స్టాండ్ అయితే బౌలర్లకు చుక్కలే.

    గతంలో యువరాజ్, క్రిస్ గేట్, హజరాతుల్లాహ్ జజాయి లాంటి బ్యాట్స్ మెన్ బౌలర్లకు ఒక్క ఓవర్లోనే చుక్కలు చూపించారు. బ్యాట్స్ మెన్ పరుగుల్లో రికార్డు సృష్టిస్తే.. బౌలర్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. అయితే ఇక్కడ ఒక బౌలర్ అందరినీ మించిపోయాడు. గతంలో ఆ బౌలర్లు బంతికి 4 పరుగుల చొప్పున ఇచ్చుకుంటే.. ఇక్కడ ఈ బౌలర్ ఏకంగా 18 పరుగులు ఇచ్చాడు.

    ఒక్క బాల్ కి 18 పరుగులా.. ఇది అసాధ్యం.. ఉట్టి మాటలే అని అనాలనిపిస్తుందా.. ఇదేందయా ఇది నేనెక్కడా చూడలే అని కూడా అనుకుంటున్నారా.. అయితే ఇది నిజమే .. ఆ బౌలర్ ఎవరో కాదు అభిషేక్ తన్వర్.. మంగళవారం రాత్రి తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023 జరిగింది. సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ ఇది. ఆ బౌలింగ్ చేసింది ఎవరో కాదు.. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్. అఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ లో మొదటి నాలుగు బంతులకు 6 పరుగులు ఇచ్చాడు. తర్వాత్ నోబాల్ వేసి 1 పరుగు ఇచ్చాడు. దీంతో 5 బంతులకు 8 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరు బంతికే ఆయనకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆఖరి బాల్ కి మూడు నో బాల్స్, ఒక వైడ్ బాల్ వేశాడు. చివరికి కరెక్ట్ గా వేశాడు. ఇందులో మొదటి నో బాల్ కు ఒక పరుగు లభించగా, రెండో నో బాల్ కి 6, నో బాల్ కి ఒక పరుగు వచ్చాయి. మూడో నో బాల్ కి 2 పరుగులు, ఒక నో బాల్ పరుగు లభించాయి. నాలుగో బాల్ వైడ్ కి ఒక పరుగు వచ్చింది.  ఆ తర్వాత కరెక్ట్ గా వేసిన బాల్ కి సిక్సర్ కొట్టాడు. దీంతో మొత్తంగా ఒక్క బాల్ కి 18 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్ లో 26 పరుగులు ఇచ్చాడన్నమాట. ట్వీ20 చరిత్రలో ఒకే బాల్ కి 18 పరుగులు ఇచ్చిన  తొలి బౌలర్ గా ఆయన చెత్త రికార్డును సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆయన జట్టు ఓడిపోయింది. చెపాక్ సూపర్ గల్లీస్ జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం అభిషేక్ తన్వర్ వేసిన ఆ ఓవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. దీనిపై క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అభిషేక్ తన్వర్ పై వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ కు..  గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు నేడు

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య...

    IPL 2024 : ఐపీఎల్ లో ఇప్పటివరకు ఎవరెన్నీడాట్ బాల్స్ వేశారంటే..

    IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ లో బ్యాటర్లు దుమ్ము...