34 C
India
Monday, May 6, 2024
More

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ కు..  గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు నేడు

    Date:

    DC Vs GT
    DC Vs GT

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు నేటి సాయంత్రం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆప్ రేసు దాదాపు మూసుకుపోయినట్లే. ఢిల్లీ క్యాపిటల్స్ లో జేమ్స్ ప్రేజర్ భీకర ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశం కాగా..  డేవిడ్ వార్నర్ ఫామ్ అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

    గుజరాత్ టైటాన్స్ కు కూడా ఈ మ్యాచ్ కీలకం కానుంది. గుజరాత్ టైటాన్స్ కు సంబంధించి కెప్టెన్ శుభమన్ గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గిల్ నుంచి భారీ ఇన్సింగ్స్ ను గుజరాత్ టైటాన్స్ ఆశిస్తోంది. పాయింట్స్ టేబుల్స్ లో  ఎనిమిది మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉండగా..  ఢిల్లీ క్యాపిటల్స్ మూడు విజయాలతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.

    ఢిల్లీ బౌలర్లు చాలా దారాళంగా పరుగులు ఇస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఖలీల్ అహ్మద్ మొన్నటి వరకు బాగానే బౌలింగ్ చేసినా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తేలిపోయాడు. ఇప్పటి వరకు అత్యధికంగా డాట్ బాల్స్ వేసిన వ్యక్తుల్లో ఖలీల్ అహ్మద్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ 87 డాట్ బాల్స్ వేసి ముందంజలో ఉన్నాడు. అయినా ఎక్కడ కూడా ఢిల్లీ బౌలింగ్ పట్టు సాధించడం లేదు.

    గుజరాత్ బ్యాటింగ్ స్లో గా సాగుతోంది. రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ల నుంచి భారీ ఇన్సింగ్స్ రావాలని కోరుకుంటోంది. ఢిల్లీ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ తో భారీ గా పరుగులు సమర్పించినప్పటికీ నాలుగు వికెట్లు తీసి మరింత భారీ స్కోరు కాకుండా ఆపాడు. అక్షర్ పటేల్ అయితే ఏకంగా క్లాసెన్ వికెట్ తీశాడు. హై స్కోరింగ్ మ్యాచ్ లో కేవలం 30 పరుగుల లోపే ఇచ్చి సన్ రైజర్స్ ను కట్టడి చేశాడు.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...