Animal Movie : హిందీ సినిమాల నిర్మాణంలో ఎన్నో మార్పులుంటాయి. సినిమా దాదాపు ఆరునెలల పాటు నిర్మిస్తుంటారు. ఇందులో హీరోహీరోయిన్లు కూడా మారుతుంటారు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియదు. అలాంటి చిత్ర విచిత్రాలు హిందీలో చోటుచేసుకుంటాయి. బాలీవుడ్ పరిశ్రమ అంటేనే అదో టైపు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా యానిమల్ సినిమాపై పలు పుకార్లు వస్తున్నాయి.
ఈ సినిమాను ఆగస్టు 11,2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని భావించినా అది కుదరడం లేదని తెలుస్తోంది. సన్నీడియోల్, అమిషా పటేల్ జంటగా నటించారు. గదర్ 2, ది కథా కంటిన్యూస్ తో క్లాస్ జరగకుండా ఉండటానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నారనే సమాచారం వస్తోంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
టీ సిరీస్ యనిమల్ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తోంది. వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడకున్నా లోలోపల నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టి సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో సహా భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు.
అగ్రహీరోల సినిమాలు విడుదలకు రెడీగా ఉండటంతో యానిమల్ సినిమాను తాత్కాలికంగా వాయిదా వేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో రణవీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అభిమానుల అంచనాల మేరకు వారి ఇమేజ్ కు తగ్గకుండా ఉంటుందని చిత్రం యూనిట్ చెబుతోంది. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం.
ReplyForward
|