35.9 C
India
Sunday, May 12, 2024
More

    బాబోయ్ ఎండలు.. ఏపీని వణికిస్తున్న ఉక్కపోత

    Date:

    the sun and weather
    the sun and weather

    తెలుగు రాష్ట్రాలను ఎండలు భయపెడుతున్నాయి. వారం క్రితం వరకు అకాలవర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రజానీకానికి ఇప్పుడు పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ముచ్చెముటలు పోయిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో మార్పులతో పాటు రానున్న నాలుగు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. మోచా తుఫాన్ తన దిశ మార్చుకోవడంతో ఊపిరి పీల్చుకున్న జనానికి ఈ ఎండలు ఊపిరి సలపనీయడం లేదు.

    వేడిగాలులతో సతమతం..

    రానున్న నాలుగు రోజుల్లో ఎండల ప్రభావం మరింత తీవ్రం కానుంది. రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ మీదుగా వీస్తున్న ఈదురుగాలుల ప్రభావం ఏపీపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎండలు ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉండనుంది. 46 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యే అవకాశమున్నదని అధికారులు చెబుతున్నారు.

    అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పల్నాడు జిల్లా రావిపాడు, గోదావరి, పొట్టిశ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాల్లో  బుధవారం 43 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశమున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. దీని తీవ్రత మెజార్టీ మండలాల్లో ఉంటుందని తెలియజేసింది. ఏపీ వ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నది.  ఎండల నుంచి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నది. అవసరముంటేనే ఇంటి నుంచి బయటకెళ్లాలని చెబుతున్నది. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, ఉపశమనానికి వీలైన పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rain in Telangana : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Rain in Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...