37.8 C
India
Monday, May 13, 2024
More

    Vijay’s Sensational Comments : కొందరు డబ్బులిచ్చి నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు.. విజయ్ సంచలన వ్యాఖ్యలు..!

    Date:

    Vijay’s Sensational Comments :

    ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేసే అవకాశం ఎంతో మందకి వస్తుంది. కానీ స్టార్ హీరోగా ఎదిగే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న వాడే విజయ్ దేవరకొండ. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన చాలా తక్కువ సమయంలోనే సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగిపోయాడు. కానీ విజయ్ ఇలా స్టార్ హీరోగా ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉంటారు. ఎంతో మంది హీరోలు ఉన్నా.. వారందనీ దాటుకుని కేవలం విజయ్ మాత్రమే స్టార్ హీరోల క్లబ్ లోకి వెళ్తున్నాడు.

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని విజయ్ ఎదిగితే తొక్కేయాలని చూసేవారు కూడా ఉంటారు కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. విజయ్ దేవరొకండ తాజాగా నటించిన మూవీ ఖుషీ. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. మూవీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కానీ ఈ సినిమా మీద నెగెటివ్ ట్రోల్స్ బాగా వస్తున్నాయి. నెగెటివ్ కామెంట్లు కూడా బాగానే చేస్తున్నారు.

    అయినా సరే మూవీకి ఆదరణ తగ్గట్లేదు. ఈ క్రమంలోనే నిన్న మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. కొందరు నాపై విషం కక్కుతున్నారు. ఖుషీ సినిమాపై కావాలనే నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. కొందరు డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయిస్తున్నారు. వేలాది ఫేక్ అకౌంట్లు, వందల కొద్దీ ఫేక్ యూట్యూబ్ ఛానెల్లు పెట్టి నా సినిమాపై నెగెటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు.

    అయినా సరే అదంతా దాటుకుని నా మూవీ ఇంత పెద్ద హిట్ అయిందంటే నా అభిమానులే అందుకు పెద్ద కారణం అని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అలా చేయిస్తున్న వారి పేర్లు విజయ్ చెప్పలేదు. దాంతో ఇప్పుడు ఆ అవసరం ఎవరికి ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. లైగర్ సమయం నుంచే విజయ్ మీద ఇలాంటి ట్రోల్స్ బాగా పెరిగాయి. అప్పట్లో స్టార్ హీరోలపై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అంటే కొంపదీసి ఏ హీరో అయినా ఇలా చేయిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి విజయ్ వారిని ఎలా కంట్రోల్ చేస్తాడో.

    Share post:

    More like this
    Related

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...