31.4 C
India
Friday, July 5, 2024
More

    Jamili Elections : వచ్చేది జమిలి ఎన్నికలే.. లా కమిషన్ నివేదిక నేడే..

    Date:

    Jamili Elections :
    దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు యోచిస్తున్నది. దీనిపై ఇప్పటికే 22వ లా కమిషన్ ను వేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికే సిద్ధమైంది. బుధవారం ఈ నివేదికను కేంద్రానికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఈ రిపోర్టులో ఏం ఉన్నదనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం, డబ్బు వృథా తగ్గుతుందని, దీంతో పాటు ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని కేంద్రం ఆలోచనలో ఉంది.

    అయితే తాజాగా తన నివేదికను ఇచ్చేందుకు లా కమిషన్ సిద్ధమవుతున్నది. జమిలి ఎన్నికలతో పాటు మరో రెండు అంశాలు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తున్నది. మాజీ రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలోని 14 మంది సభ్యుల కమిటీను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ నివేదిక కీలకంగా మారింది. కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతున్నదనేది చర్చనీయాంశంగా మారింది. అయితే 2024, 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం అందుతున్నది. సార్వత్రిక ఎన్నికలకు బదులు జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు షెడ్యూల్ ఎలా ఉండాలనే అంశంపై కూడా సూచనలు చేయబోతున్నది. నివేదికకు తుది మెరుగులు దిద్దిన అనంతరం కమిటీ భేటీ కాబోతున్నది. ఆ తర్వాత పూర్తి రిపోర్టును కేంద్ర న్యాయశాఖకు అందిచబోతున్నది.

    ఈరోజు చైర్మన్ రితూరాజ్ అవస్థి నేతృత్వంలో కమిటీ భేటీ కాబోతున్నది. జమిలి ఎన్నికలు, పోక్సో చట్టం వయస్సు నిర్ధారణ, ఇక ఎఫ్ఐఆర్ లను తప్పనిసరిగా ఆన్ లైన్ చేసే అంశంపై నివేదికలను ఈరోజు కమిటీ ఫైనల్ చేయబోతున్నది. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఆలోచనను గతంలోనే 2018 లో వేసిన జస్టిస్ బీఎస్ చౌహాన్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పుడు 22వ లా కమిషన్ కూడాదాని వైపే మొగ్గు చూపింది.  22 వ లాకమిషన్ కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రీతు రాజ్ అవస్థి నేతత్వంలో గతేడాది నవంబర్ లో కేంద్రం నియమించింది. వచ్చే ఏడాది ఆగస్టు 31వరకు ఈ కమిషన్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో పొడగించింది. మరి ఈరోజు కమిటీ నివేదిక ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Nadendla Manohar : రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: మంత్రి నాదెండ్ల మనోహర్

    Nadendla Manohar రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్...

    Dr. Jai : డా.జై గారిని సన్మానించిన సోనూసూద్.. వీడియో

    Sonusood honored Dr. Jai Garu : రక్తం అందక ఎంతో...

    UK Election Results 2024 : యూకే ఎన్నికల ఫలితాలు 2024: కొంప ముంచిన రిషి సునాక్!

    UK Election Results 2024 : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ...

    Comedian Daughters : క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కమెడియన్ కూతుళ్లు

    Comedian Daughters : భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో కన్నా  తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య...

    Jamili Elections : కేంద్రం ఆదేశిస్తే.. జగన్ ముందస్తుకు వెళ్లాల్సిందేనా.. ?

    Jamili Elections : కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లానుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి....

    Jamili Elections : జమిలి ఎన్నికలకు కమిటీ.. సౌత్ కు దక్కని చోటు

    Jamili Elections : కొంతకాలంగా దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతంగా చర్చ...

    Jamili Elections : జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

    Jamili Elections : కేంద్రం ఈ సారి జమిలి ఎన్నికలకు వెళ్లాలని...