31.3 C
India
Sunday, June 16, 2024
More

    BRS Ready To Campaign With NRI : బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శ్రేణులతో ప్రచారానికి రెడీ

    Date:

    BRS Ready To Campaign With NRI
    BRS Ready To Campaign With NRI

    BRS Ready To Campaign With NRI : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు కె. తారక రామారావు ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లోని ప్రతినిధులతో నేడు సమావేశం కానున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖల కోర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.

    నవంబర్ 30న పోలింగ్ నిర్వహిస్తున్నందున సోషల్ మీడియా కాంపెయిన్ పేరుతో కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నారైలు పర్యటించి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో 2018లో సైతం ఇలాగే ఎన్నారైల ప్రచారం మూలంగా పార్టీ విజయం సాధించింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఆ బాటలోనే పయనిస్తున్నారు.

    52 దేశాల్లో ఉన్న ఎన్నారైల సాయంతో పార్టీ మరోమారు అధికారంలోకి రావాలని చూస్తోంది. దీనికి వారి సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వారిని ఉపయోగించుకుని ప్రచారం ముమ్మరం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే వారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. దీనికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

    తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఉందని ఎన్నారైలు చెప్పనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి కూడా వివరించనున్నారు. ఈ మేరకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ మూడోసారి విక్టరీ సాధించాలని అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.

    Share post:

    More like this
    Related

    T20 Cricket New Jersey : డా. జై గారి సహకారంతో న్యూజెర్సీలో టీ-20 హవా.. దుమ్మురేపిన ‘టీమ్ 1983’

    T20 Cricket Match New Jersey : భారతీయులు ఎక్కడుంటే అక్కడ...

    ATA Convention Recap : అట్లాంటాలో వైభవంగా ATA కన్వెన్షన్ రీక్యాప్, కండ్లు చెదిరేలా కార్యక్రమాలు..

    ATA Convention Recap : అట్లాంటాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్...

    American Woman : ప్రియుడి కోసం.. భారత్ కు అమెరికా యువతి

    American Woman : పబ్ జీ ప్రేమలో పడి భారత్ కు...

    Char Dham Yatra : కుమార్తె తోడుగా సైకిల్ పై చార్ ధామ్ యాత్ర

    Char Dham Yatra : గుజరాత్ కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఈసీకి ఫిర్యాదు

    RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై...

    BRS : బీఆర్ఎస్ కు అసలు ముప్పు ముందుందా?

    BRS Party : లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని మూడు పార్టీలు...

    BRS Party : బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు 

    BRS party : బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపో తున్నారు....