32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Date:

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ సినిమాలో ఘనవిజయం సాధిస్తుంది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ఎపిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. రిలీజ్ కు చాలా వాయిదాల తర్వాత ఫైనల్ డేట్ జూన్ 27న ప్రకటించారు మేకర్స్.

    తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ సన్నిహితుడైన హీరో రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగ్ అశ్విన్ తో తన చిరకాల స్నేహాన్ని బయటపెట్టిన దగ్గుబాటి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడం తనకు ఎగ్జయిటింగ్ ఉందని చెప్పారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘నెక్ట్స్ బిగ్ మూమెంట్ కల్కి. భారతదేశం, భారతీయ, ప్రవాస భారతీయులే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు.

    ఈ చిత్రాన్ని భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన అద్భుతమైన ‘అవెంజర్స్ మూమెంట్’తో పోల్చాడు రానా. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ఆయన అన్నారు. అభిమానుల్లో ఆసక్తిని పెంచేందుకు కామిక్-కాన్ ఈవెంట్లలో మూవీ గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కామిక్-కాన్ పాప్ సంస్కృతి, సూపర్ హీరో ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ తో ఎలా సంబంధం కలిగి ఉందో తెలుస్తుంది.

    ‘కల్కి 2898 ఏడీ’లో తనకు ఎలాంటి పాత్ర లేదని రానా స్పష్టం చేశారు. అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆయన కనిపించడం ప్రేక్షకులను మరింత ఎగ్జయిటింగ్ కు తీసుకెళ్తుంది.

    గురుగ్రామ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి రానా పాల్గొన్నారు. అక్కడ ఈ సినిమా గురించి మాట్లాడారు. మహాభారతం యుగం నుంచి మొదలై క్రీ.శ.2898లో ముగిసే ఈ చిత్రం 6000 సంవత్సరాల నిడివితో ఉంటుందని అశ్విన్ తెలిపారు.

    ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటి దిశా పటానీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki Movie : ‘కల్కి’ టికెట్లు విడుదల.. నిమిషాల్లో థియేటర్లు హౌస్ ఫుల్

    Kalki Movie Tickets : ప్రభాస్ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్న ‘కల్కి...

    Kalki 2898 AD : కల్కి రోల్ లో కనిపించేది ప్రభాసేనా?

    Kalki 2898 AD : ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD'...

    Prabhas : ప్రభాస్ తో పాటు ఆ ఇద్దరిపైనే ఫోకస్

    Prabhas : 'కల్కి 2898 AD' ట్రైలర్‌ చూశాక ప్రేక్షకుల్లో సినిమాపై...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...