25.2 C
India
Friday, June 28, 2024
More

    T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ లో మరో ప్రపంచ రికార్డు

    Date:

    T20 World Cup 2024
    T20 World Cup 2024

    T20 World Cup 2024 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఒమన్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి విజయంలోనే  ప్రపంచ రికార్డు సృష్టించింది.  స్కాట్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో అవమానకరమైన రీతిలో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ సూపర్ 8కి అర్హత సాధించడంపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఇంగ్లండ్ జట్టు ఒమన్‌ను దారుణంగా ఓడించింది. సూపర్-8 చేరుకునేందుకు  ఆశలు సజీవంగానే ఉన్నాయి.

    టాస్ ఓడి  ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ కేవలం 47 పరుగులకే ఆలౌటైంది. కాగా, ఇంగ్లండ్‌ 48 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3.1 ఓవర్లలో (19 బంతులు)నే సాధించింది. దీంతో ఇంగ్లండ్ జట్టు తమ పేరిట సరికొత్త రికార్డు సృష్టించారు.

    బంతుల పరంగా చూస్తే..
    అతి తక్కువ బంతుల్లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు ఇంగ్లండ్ ఇంకా 101 బంతులు మిగిలి ఉండగానే ఓమన్ పై విజయం సాధించింది. ఇంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో ఏ జట్టు కూడా ఇంత తక్కువ బంతుల్లో విజయం సాధించలేదు. ఈ రికార్డు గతంలో శ్రీలంక పేరిట ఉంది. 2014లో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 90 బంతుల్లో శ్రీలంక విజయం సాధించింది.

    టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారీ విజయాలు ఇవే..
    101 బంతులు- ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్ 2024
    90 బంతులు-శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ 2014
    86 బంతులు-ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా 2024
    82 బంతులు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, 2021
    81 బంతులు ఇండియా వర్సెస్ స్కాట్లాండ్, 2021

    సూపర్ 8కు ఆశలు సజీవం..
    ఓమన్ పై భారీ విజయంతో ఇంగ్లండ్ సూపర్- 8లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రూప్‌-బీ లో 3 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నది. 5 పాయింట్లతో స్కాట్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ చివరి మ్యాచ్. అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించాలి. మరోవైపు నమీబియాపై ఇంగ్లండ్‌, స్కాట్‌లాండ్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే సూపర్‌ 8కి ఇంగ్లండ్‌ అర్హత సాధిస్తుంది. రెండు జట్లకు (ఇంగ్లండ్, స్కాట్లాండ్) 5 పాయింట్లు ఉంది. అయితే స్కాట్లాండ్ కంటే ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : కంగారెత్తించినా.. చివరకు విజయంతో సెమీస్ కు భారత్

    Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో...

    Rohit Sharma : రోహిత్ శర్మ భీకర ఇన్సింగ్స్.. రికార్డులు బద్దలు

    Rohit Sharma : టీం ఇండియా సూపర్ 8 మ్యాచ్ లో...