32 C
India
Sunday, June 30, 2024
More

    Change in Jagan : జగన్ లో ఆ మార్పునకు కారణం ఇదేనా..? ఎందుకిలా..?

    Date:

    Change in Jagan : ఇటీవల ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అందరిలో ఒక ప్రశ్న మెదిలింది. అదేంటంటే? జగన్ వస్తారా? రారా? అని. కానీ ఎవరూ ఊహించనట్లు ఆయన వచ్చారు.. వెళ్లారు.. కానీ ఆయన తీరులో ఆత్మన్యూనతాభావం ఉన్నట్లు కనిపించింది. అలవా ఉన్ననప్పుడు ఆయన ఏదైనా విషయం చెప్పాలనుకుంటే తడబడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. జగన్ తీరు కూడా అలానే ఉంది.

    జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించడమే వెనక గేటు నుంచి వచ్చారు. ఎందుకంటే.. వచ్చే దారిలో.. అమరావతి రైతులు తనపై దాడి చేస్తారని ఆయన అలా వచ్చారనే వాదన వినిపిస్తోంది. సరే వచ్చారు కదా.. అనుకుంటే.. హుందాగా సభలోకి రావాల్సిన ఆయన.. తన ప్రమాణ స్వీకారం కోసం పేరు పిలిచిన సమయంలోనే వచ్చారు. వచ్చి ఐదు నిమిషాలు చివరి బెంచ్‌లో కూర్చొని ప్రమాణ స్వీకారం చేశాక.. అసెంబ్లీలో ఉండకుండా.. తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. ఇక అటునుంచి అటు ఇంటికి వెళ్లారు. అప్పుడు కూడా వెనక గేటు నుంచే వెళ్లారు. ఇలా నిన్న జగన్.. అడుగడుగునా.. ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిలా వ్యవహరించారనే టాక్.

    జగన్ ఓడిపోయినా వైసీపీకి 40 శాతం ఓటు షేర్ ఉంది. కాబట్టి ఓట్లు వేసిన వారికి ప్రతినిధిగా జగన్ సభలోకి ధైర్యంగా రావాలి, కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలపై నిలదీయాలి. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మద్దతుగా వ్యవహరించాలి. తను కూడా ఒక ప్రజా ప్రతినిధని మరువద్దు, గంభీరంగా ఉండాలి.  తనకు ఓటు వేసే వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మాని తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది.

    ఇవాళ (జూన్ 22) కూడా వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లద్దని నిర్ణయించుకుంది. మరి ఆ పార్టీకి ఓట్లేసిన వారి సంగతేంటి? వారి తరఫున అసెంబ్లీలో ఎవరు ఉండాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కదా. కాడి వదిలి సేద్యం చేస్తానంటే ఎలా? ఇదే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. ఫలితాలు వచ్చినప్పటి నుంచి జగన్ అదోలా వ్యవహరిస్తున్నారని, తనకు ఓట్లు ఎందుకు వేయలేదో అని ప్రజలను తప్పుపుడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఓట్లు వేసిన వారికి భరోసాగా ఉండాల్సిన ఆయన.. అసెంబ్లీకి వెళ్లద్దనే తీరు.. సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    Suryakumar Yadav : కప్పు తెచ్చిన క్యాచ్.. కపిల్ ను గుర్తు చేసిన సూర్య

    Suryakumar Yadav : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...