32.9 C
India
Monday, May 13, 2024
More

    New Zealand Vs India : సండే ఫైట్.. కివీస్, భారత్ జట్ల మధ్య కీలక పోరు

    Date:

    New Zealand Vs India
    New Zealand Vs India

    New Zealand Vs India : ఐసీసీ వరల్డ్ కప్ లో ఆదివారం కీలకపోరు జరుగుతున్నది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని రెండు జట్ల మధ్య ఈ పోరు జరగబోతున్నది. పాయింట్ల పట్టికలో వరుస రెండు స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య హిమచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు జరుగుతుంది. నెట్ రన్ రేట్ ఆధారంగా కివీస్ టాప్ లో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.

    అయితే రెండు జట్లు కూడా నాలుగు విజయాలు ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. ఇక ఆదివారం జరిగే మ్యాచ్ రెండు జట్లకు ఐదోది.  ఇప్పటికే ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఆప్గానిస్థాన్, బంగ్లాదేశ్ ను ఓడించింది న్యూజిలాండ్ జట్టు. ఇక ఆస్ర్టేలియా, ఆప్ఘానిస్థాన్ , బంగ్లాదేశ్ పై గెలుపుతో జోష్ లో ఉంది రోహిత్ సేన. ఇక వరుస విజయాలతో ఊపు మీదున్న ఈ రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి.

    టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మంచి ఊపు మీద ఉన్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, ఓపెనర్ శుభ్ మన్ గిల్ కూడా రాణిస్తున్నారు. టాస్ గెలిస్తే టీమిండియా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ముందుగా బౌలింగ్ చేస్తే తర్వాత బ్యాటర్లు విజయతీరాలకు చేర్చే అవకాశం ఉంటుంది. అటు కివీస్ బ్యాటర్లు కూడా సమష్టిగా రాణిస్తున్నారు.

    డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్ సత్తా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది రేపటి మ్యాచ్ కు ధర్మశాలలో భారత అభిమానులకు పండుగే అన్నమాట. పరుగుల వరద పారే అవకాశం ఉందన్నమాట.

    ఇక హార్ధిక్ పాండ్యా గాయపడడంతో ఎవరు జట్టులోకి వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. హార్ధిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక శార్ధుల్ ను పక్కనపెట్టి షమీని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా ఇదీ

    రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్య, జడేజా, బుమ్రా, సిరాజ్, కులదీప్ యాదవ్, శార్దుల్/షమీ,

    Share post:

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది....

    Dravid Plan : సెమీస్ కు టీమిండియా రెడీ..ద్రావిడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    Dravid Plan : వరల్డ్ కప్ లో టీమిండియా ఎనిమిది వరుస...

    Miss the Catch : క్యాచ్ మిస్సయితే.. కప్పు మిస్సయినట్లే..!

    Miss the Catch : క్రికెట్ లలో ప్రతి దేశంలో కోరుకునే కల.....