
World Cup Upper Leg : వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కప్ పై కాళ్లు పెట్టుకుని వారు పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మన అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కంగారూలు మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వారి గెలుచుకున్న కప్ వారి ఇష్టమొచ్చినట్లు చూసుకుంటారని వాదించారు.
ఇండియన్లు మాత్రం ఆసీస్ ఆటగాళ్ల తీరును తప్పుపట్టారు. వరల్డ్ కప్ అనే ఇంగిత జ్ణానం లేకుండా అలా చేయడంపై స్పందించారు. వారు సాధించుకున్న ట్రోఫీని వారి ఇష్టమొచ్చినట్లు చూసుకుంటారు. అది వారి కల్చర్. దాని మీద మన వారెందుకు నోరు పారేసుకోవాలి అనే కామెంట్లు వచ్చాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తుంటారు. వరల్డ్ కప్ మనకు గౌరవం కావచ్చు. కానీ వారికి కాదని మనం తెలుసుకోవాలి.
వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ట్రోఫీ ఏదైనా ఆసీస్ సొంతం చేసుకోవడం సహజమే. ఒలింపిక్స్ పతకాల విషయంలో వారు టాప్ ఫైవ్ లో ఉంటుంటారు. చైనా, అమెరికాలకు పోటీ ఇస్తుంటారు. ట్రోఫీలు, మెడల్స్ వారికి కొత్తేమీ కాదు. అలాగని ట్రోఫీని కాళ్లతో తన్నడం తప్పుగా భావించడం కరెక్టే. అది వారి మదమే అని తెలుసు.
కానీ వారి కప్ ను వారి ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం కరెక్టు కాదు. అలాంటి కప్ ను వారు అలా అమర్యాదగా చూడటం మన వారికి నచ్చలేదు. వారి సొంత విషయమైతే నాలుగు గోడల్లోనే ఏదైనా చేసుకోవాలి. ప్రజల మధ్య కనిపించడంతోనే తప్పుపట్టారు. కంగారూలు అలా చేయడం సమంజసం కాదనే వాదనలు రావడం సహజమే.