31.3 C
India
Saturday, April 27, 2024
More

    Afghanistan Captain Emotional : భారత ట్యాక్సీ డ్రైవర్ చేసిన పనికి ఎమోషనల్ అయిన అప్ఘనిస్తాన్ కెప్టెన్

    Date:

    Afghanistan Captain Emotional
    Afghanistan Captain Emotional

    Afghanistan Captain Emotional : భారతీయుల అభిమానం కొలవలేనిది. ప్రపంచ కప్ లో అఫ్గానిస్తాన్ రాణించడానికి మీ ప్రేమే కారణం. దీనికి రుణపడి ఉంటామని ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది అభిప్రాయపడ్డాడు. భారత అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే సంతోషంగా ఉన్నాం. అఫ్గాన్ ఆడిన ప్రతి మ్యాచ్ కు భారీగా స్టేడియానికి వచ్చి సంతోషపరుస్తున్నారు. దీంతో మాకు రెట్టించిన ఉత్సాహం కలుగుతోంది.

    బయటకు వెళ్లినా గుర్తుపట్టి మరీ సహకరిస్తున్నారు. మైదానంలోనే కాదు బయట కూడా మీ అభిమానానికి థ్యాంక్స్. ఎంతో ఆదరిస్తున్నారు. గౌరవం ఇస్తున్నారు. క్రికెట్ అంటే ఇంత అభిమానం చూపిస్తారని తెలియదు. భారతీయులు ప్రేమగల వ్యక్తులు అని నమ్ముతున్నాం. మీ ప్రేమ మమ్మల్ని కట్టిపడేస్తోంది. మీరు ఆదరిస్తున్న తీరు మాకెంతో స్ఫూర్తినిస్తోంది.

    ఓ టాక్సీ డ్రైవర్ నన్ను బయటకు తీసుకెళ్లాడు. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు. అతడి ప్రేమకు కూడా ఫిదా అయిపోయాను. ఒక ఆటగాడికి ఇంత స్థానం ఇస్తారా? ప్రపంచ కప్ లో ఇంతకుముందు ఒకే మ్యాచ్ గెలిచాం. కానీ ఈసారి కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకంతో ఉన్నాం. విజయాలు నమోదు చేస్తామనే దీమాతో ఉన్నాం.

    అఫ్గానిస్తాన్ కెప్టెన్ ప్రేక్షకుల మదిని దోచాడు. ఈ ప్రపంచ కప్ లో భారత్ లో ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. త్వరలో దేశానికి పేరు తీసుకొచ్చేలా మ్యాచ్ లు ఆడతాం. మెరుగైన ప్రదర్శన చేస్తాం. అందరిని మెప్పిస్తాం. భారతీయుల అభిమానానికి పొంగిపోతున్నాం. మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటాం. మా ప్రదర్శనను మరింత పదును చేసుకుంటామని భరోసా ఇచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related