30.6 C
India
Monday, May 13, 2024
More

    Miss the Catch : క్యాచ్ మిస్సయితే.. కప్పు మిస్సయినట్లే..!

    Date:

    Miss the Catch
    Miss the Catch

    Miss the Catch : క్రికెట్ లలో ప్రతి దేశంలో కోరుకునే కల.. ప్రపంచ కప్ సాధించడం. ప్రతి దేశం తమ జట్టు ప్రపంచ కప్ సాధించాలని కోరుకుంటుంది. ఇందు కోసం ముందుగానే తమ ప్రాక్టీస్ ను మొదలు పెడుతుంది.  అయితే ప్రపంచ కప్ కు సంబంధించి పలు ఆసక్తిక సంఘటనలు ఉన్నాయి.

    ప్రతి మ్యాచ్ లో ప్రతి ప్లేయర్  ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒక క్యాచ్‌ కనురెప్పపాటులో చేజారినా.. ఆ ప్లేయర్ కి లైఫ్ దొరికినట్లే… ఒక్కసారి క్రీజ్  నిలిస్తే ఆట ఫలితమే తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఇందుకు ఉదాహరణ. సౌతాఫ్రికా ఒక క్యాచ్ ను వదిలేసి ప్రపంచ కప్ ను చేజార్చుకుంది. అఫ్గాన్‌ ఆటగాడు ముజీబ్‌ ఓ క్యాచ్‌ వదిలేయడంతో మ్యాక్స్‌వెల్‌ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు.

    కొద్ది రోజుల్లో నాకౌట్‌ దశ మొదలు కానుంది. భారత్‌ కచ్చితంగా నాకౌట్‌ దశలోని రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 ఓవర్లు ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంది. ఇక్కడ ఫీల్డర్లు యాక్టివ్ గా లేకపోతే సమస్యలు తప్పవు. జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు మైదానంలో చురుగ్గా ఉంటారు. టీమ్ మేనేజ్ మెంట్ కూడా ఫీల్డింగ్‌ విలువను గుర్తించి  కొత్తగా ఈ విభాగంలో మెడల్‌ కూడా ప్రవేశపెట్టింది.

    భారత్ మెరుగ్గానే..

    ఫీల్డింగ్‌లో టీమిండియా పటిష్టంగా ఉంది. క్యాచ్‌లు పట్టడంలో 85శాతం సక్సెస్‌రేటును సాధించినట్లు ఇటీవలి గణంకాలు వెల్లడించాయి. కేవలం ఆరు క్యాచ్‌లను మాత్రమే భారత్‌, ఇంగ్లాండ్‌ జారవిడిచాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు ఒక్కోటి 14 క్యాచ్‌లు, అఫ్గానిస్థాన్‌ 13 క్యాచ్‌లు, న్యూజిలాండ్‌, శ్రీలంక ఒక్కోటి 16 చొప్పున క్యాచ్ లు జారవిడిచాయి. దాయాది పాకిస్తాన్ జట్టు 7 క్యాచ్‌లను వదిలేసింది. గత ప్రపంచకప్‌లో ఖరీదైన క్యాచ్‌లు కూడా ఉన్నాయి.

    హెర్షల్‌ గిబ్స్‌ వదిలేసింది ప్రపంచకప్‌ క్యాచ్‌..!

    1999లో సూపర్‌ సిక్స్‌ దశలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా ఢీకొన్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా హెర్షల్ గిబ్స్‌ శతకం సాయంతో 271 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన ప్రారంభించిన ఆసీస్‌ 48/3 గా ఉన్న దశలో లాన్స్‌ క్లూసెనెర్‌ బౌలింగ్‌లో స్టీవ్‌వా క్యాచ్‌ ఇచ్చాడు. దానిని పట్టకముందే దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ హడావుడిలో గిబ్స్‌ క్యాచ్‌ చేజార్చాడు. అనంతరం స్టీవ్‌వా గిబ్స్‌ వద్దకు వెళ్లి ‘హెర్షల్‌.. నీకు వరల్డ్‌ కప్‌ను ఎలా చేజార్చుకోవాలనిపించింది?’ అని వ్యాఖ్యానించాడు.

    ఆ తర్వాత స్టీవ్‌ 120 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా విజయం సాధించింది. గిబ్స్‌ వదిలేసిన ఆ క్యాచ్‌ వల్ల అతడు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన శతకం కూడా వృథాగా మారిపోయింది. ఇక సెమీస్‌లో మరోసారి ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి అలెన్‌ డొనాల్డ్‌ రనౌట్‌ కావడంతో ఆసీస్‌ ఫైనల్స్‌కు వెళ్లింది. అక్కడ పాక్‌ను ఓడించి రెండోసారి ప్రపంచకప్‌ గెలిచింది.

    ఇంగ్లాండ్‌ కప్పు ఆశలపై నీళ్లు..

    1992 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ తలపడ్డాయి. ఇది ఆసీస్‌లోని మెల్‌బోర్న్‌లో జరిగింది. పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేపట్టింది. ఓపెనర్లు సొహైల్‌-రమీజ్‌ రజాలు ఇంగ్లిష్‌ బౌలర్ డెరిక్‌ ప్రింగిల్‌ దెబ్బకు త్వరగా పెవిలియన్‌ చేరుకొన్నారు. అప్పటికి పాక్‌ స్కోరు 24/2. ఆల్‌రౌండర్‌ పాక్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో స్థానంలో బరిలోకి వచ్చాడు. కొద్దిసేపు మెల్లగా ఆడిన ఇమ్రాన్‌లో సహనం నశించింది. ఫిల్‌ డిఫ్రిటాస్‌ బౌలింగ్‌లో ఓ అనవసరపు షాట్‌ ఆడేందుకు యత్నించాడు.

    ఈ క్రమంలో బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకొని ఇంగ్లిష్‌ జట్టు కెప్టెన్‌ గ్రాహం గూచ్‌ సమీపంలోకి వెళ్లింది. అతడు ఆ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆ తర్వాత ఇమ్రాన్‌ కుదురుకొని 72 పరుగులు చేశాడు. వారి జట్టులో అతడే టాప్‌ స్కోరర్‌. పాక్‌ మొత్తం 249 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్‌ లక్ష్య ఛేదన సమయంలో పాక్‌ బౌలర్లు వసీం అక్రం, ఆకీబ్‌ జావెద్‌, ముస్తాక్‌ అహ్మద్‌ విజృంభించారు. 227 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్‌కు చేరింది. పాక్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

    క్యాచ్‌ డ్రాప్‌.. గప్తిల్‌ ప్రపంచ రికార్డ్‌..!

    2015 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌ తలపడ్డాయి. కివీస్‌ బ్యాటర్ల సొంత మైదానం వెల్లింగ్టన్‌లో ఈ పోరు జరిగింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ తొలి బంతినే బౌండరీ దాటించి జోరుమీదున్నట్లు కనిపించాడు. కానీ, జెరోమె టేలర్‌ వేసిన స్క్వేర్‌ లెగ్‌ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడ ఫీల్డర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఆ తర్వాత గప్తిల్‌ ఏమాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. 237 పరుగులు సాధించి.. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 393 పరుగులు చేసింది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది....

    Dravid Plan : సెమీస్ కు టీమిండియా రెడీ..ద్రావిడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    Dravid Plan : వరల్డ్ కప్ లో టీమిండియా ఎనిమిది వరుస...

    Afghanistan Captain Emotional : భారత ట్యాక్సీ డ్రైవర్ చేసిన పనికి ఎమోషనల్ అయిన అప్ఘనిస్తాన్ కెప్టెన్

    Afghanistan Captain Emotional : భారతీయుల అభిమానం కొలవలేనిది. ప్రపంచ కప్...