![Fire Accident](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-2-16.jpg)
Fire Accident : ఢిల్లీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ఆరుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.
తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. గాయపడిన చిన్నారుల్లో ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో ఐదుగురికి వైద్య సేవలను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. తొమ్మిది అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. దాదాపు గంటకు పైగా అగ్నిమాపక దళాలు శ్రమించాయి.
ఈ ప్రమాదంలో రెండు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనం పైఅంతస్తు నుంచి చిన్నారులను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మొదటగా మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత భవనమంతా మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు.