![America](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/IMG-20240607-WA0005.jpg)
America : అమెరికాలో క్రికెట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండదు. అన్ని క్రీడారంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న అగ్రరాజ్యం ఎందుకో క్రికెట్ లో రాణించలేకపోయింది. ఆ లోటును కూడా తీర్చుకునేందుకు కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ పై మక్కువ పెంచుకుంది. క్రికెట్ లో ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్న ఈ దేశం. విదేశాల్లో అవకాశాలు రాక.. డొమెస్టిక్ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా మెయిన్ టీంకు సెలెక్ట్ కాలేకపోయిన వారికి చాన్స్ లు ఇచ్చి అమెరికాలో క్రికెట్ కు జీవం పోసుకుంది.
ప్రస్తుతం ఆతిథ్య దేశం హోదాలో టీ 20 వరల్డ్ కప్ లో ఆడుతూ.. వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ కెనడా పై 195 పరుగులను ఛేజ్ చేసి గెలిచిన విజయం గాలివాటం కాదని పాకిస్థాన్ పై గెలిచి నిరూపించుకుంది. అయితే టీ 20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో బంగ్లాను 2-1 తో ఓడించి అందరి దృష్టిలో పడింది.
అమెరికాకు ఏప్రిల్ లో కొత్త కోచ్ సువార్ట్ లా చార్జ్ తీసుకున్నాడు. దీంతో అతడు టీంలో ప్లేయర్ల సత్తాను గుర్తించాడు. టీ 20 లో ఏదైనా సాధ్యమనే విషయాన్ని యూఎస్ఏ క్రికటర్లకు నేర్పాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో రాణించిన కెప్టెన్ మోనాంక్ పటేల్, అరోన్ జోన్స్, అండ్రీస్ ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ లో కూడా దుమ్ము రేపుతున్నారు. కెప్టెన్ మోనాంక్ పటేల్ పాకిస్థాన్ పై 50 పరుగులు చేసి వారెవ్వా అనిపించుకున్నాడు.
బౌలర్లలో నేత్రవల్కర్, మెకింజి, హర్మీత్ లాంటి వారు రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో పసికూనలా ఏ మాత్రం కనిపించుకుండా ప్రొఫెషనల్ సీనియర్ టీంకు ఏ మాత్రం తగ్గకుండాా అదరగొడుతుంది. అమెరికా టీంలో విదేశీ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నా.. మరో మ్యాచ్ గెలిస్తే సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశం ఉంది. అమెరికా కు తక్కువ వేస్తే ఇండియాకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా ప్లేయర్లపై ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటున్నారు.