34.1 C
India
Monday, June 17, 2024
More

    Chandrababu : చంద్రబాబును తిట్టడమే మంత్రుల పని.. ఏపీలో సర్కారు తీరిదే..

    Date:

    Chandrababu :

    అందరిది ఒక దారి అయితే.. ఏపీది మరొక దారి.. మిగతా రాష్ర్టాలు అన్నిరంగాల్లో దూసుకుపోతుంటే, రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరి ఏపీలో పాలన కొనసాగుతున్నది. కేవలం చంద్రబాబును తిట్టడమే ప్రభుత్వంలోని మంత్రుల పనిగా పాలన సాగుతున్నది. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేసిందేమిటనే చూస్తే విధ్వంసం, పేర్లు మార్చడం, రంగులేయడం, ప్రశ్నిస్తే జైలు పాలు చేయడం, అప్పులు. ఇలాంటి ప్రభుత్వంలో ప్రజలు ఆశించిన దక్కేది ఏం ఉండదు.

    ఇక మంత్రులు మీడియా ముందుకు వచ్చి తమ శాఖ ల ప్రగతి గురించి మాట్లాడింది లేదు. ఇటు చంద్రబాబు, లోకేశ్, పవన్ లక్ష్యంగా మాత్రమే వారి సమావేశాలు ఉంటాయి. అసలు మంత్రులకు శాఖలపై పట్టే లేదని టాక్ ఉంది. ఏదున్నా జగన్ బాబు మాత్రమే చూసుకుంటారని వారే స్వయంగా చెబుతున్నారంటే పరిస్థితి ఏంటో  అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వారికి ఒక టాపిక్ దొరికింది. ఇక చూసుకోండి వారి పండుగ.

    చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయంటూ ఒక వార్తను పట్టుకొని ఇక ప్రెస్ మీట్లు పెట్టి మరి సంతోష పడుతున్నారు. రాష్ర్టంలో మహిళలపై దాడులు, రైతుల కష్టాలు, హత్యలు, లైంగిక దాడులు, ఇలాంటి వాటిపై స్పందించలేదు. ఏకంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకూడా చంద్రబాబు నాయుడిపై ప్రెస్ మీట్ పెట్టి తిట్టి పోశారు. మహిళలపై దాడుల విషయంలో స్పందించడానికి మాత్రం ఆమెకు సమయం ఉండదని అంతా అనుకుంటుంటారు. ఇది నిజం చేస్తూ ఆమె ప్రెస్ మీట్లు ఉంటాయి.

    ఈ రాష్ర్టానికి రాజధాని ఏంటో కూడా తెలియకుండా చేసిన నేతలు.. ఈరోజు ఒక్క నాయకుడిని తిట్టేందుకు సమయం వెచ్చిస్తున్నారు. సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన. ఈ సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ప్రజల చూపును మళ్లించేందుకు చంద్రబాబును మంత్రులు, నేతలతో తిట్టించే పని మొదలు పెట్టారు. ఇదంతా కాలక్షేప రాజకీయాలంటూ విశ్లేషకులు తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా దేశమంతా ఓ చర్చ నడిస్తే ఏపీలో మాత్రం ఒక్క చంద్రబాబు మీదే చర్చ అన్నట్లుగా పరిస్థితి ఉంది.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : జగన్ అప్పులకుప్ప చేసి వెళ్లాడు..చంద్రబాబుకు సవాల్ గా మారనుందా?

    Challenges to Chandrababu : ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి...

    Dr. Jai Yalamanchili : జగన్ విశాఖ రిషికొండ జగన్ విలాసాలపై ముందే చెప్పిన జై గారు

    Dr. Jai Yalamanchili : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...