Big Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి అప్పుడే నాలుగు వారాలు పూర్తి కూడా అయ్యింది.. మొదటి రెండు వారాలు మాత్రమే ఆడియెన్స్ కాస్త ఇంట్రస్ట్ గా చూసారు.. వీకెండ్ ఎపిసోడ్ కూడా నాగార్జున హోస్టింగ్ తో బాగా చేసాడు.. దీంతో ప్రేక్షకుల్లో కూడా చూడాలి అనే ఎంజాయ్ మెంట్ కనిపించింది. కానీ మూడవ వారం స్టార్ట్ అయ్యాక పరిస్థితి మారిపోయింది..
వారం మొత్తమే కాదు వీకెండ్స్ కూడా చెప్పగానే సాగిపోతున్నాయి.. నాగార్జున పెద్దగా ట్విస్టులు ఏమీ ఇవ్వలేదు.. చూసే ప్రేక్షకుల్లో కూడా ఇది అసలు వీకెండ్ ఎపిసోడ్ నేనా అనే సందేహం కలుగుతుంది.. నాగార్జున ఈ వారం కూడా అంతగా ఫన్ జనరేట్ చేయలేక పోయాడు.. ఒక్క శివాజీ నన్ను హౌస్ మేట్ గా ఎందుకు తీసేసారు అని అడగడం దానికి సరైన కారణాలు చెప్పమని చెప్పిన ట్రాక్ మాత్రమే ఆడియెన్స్ కు ఆసక్తిగా అనిపించింది.
ఇక నాగ్ బొమ్మ గియ్ అనే టాస్క్ ఆడిస్తూ నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు. అనుకున్న విధంగానే ఈ వారం రతికా రోజ్ ఇంటి నుండి బయటకు వచ్చింది.. ఈమె ఎలిమినేట్ అవుతుంది అని చెప్పగానే హౌస్ లో ఎవరు కూడా ఎమోషనల్ అయినట్టు అనిపించలేదు.. ఇక ప్రశాంత్ బాధ పడతాడు అనుకుంటే నాకు సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరించాడు.
ఇక రతికా కూడా అందరితో మాట్లాడింది కానీ ప్రశాంత్, శివాజీ దగ్గరికి రాలేదు.. శివాజీ దగ్గరికి వెళ్లిన పట్టించుకోనట్టే చేసింది.. ఇతడు కూడా దగ్గరికి వెళ్లిన పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు.. ఇక రతిక వెళ్లిపోతుంటే ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతుంది అని మాత్రమే అనుకున్నారు కానీ కిరణ్, షకీలా, దామిని వెళ్ళిపోతున్నప్పుడు కనిపించిన ఎమోషన్ అయితే కనిపించలేదు.. ఏదో బాధ పడినట్టు అంతా నటించారు.. దీంతో ఆడియెన్స్ అందరు మహానటులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..