nayanthara నయనతార గురించి స్పెషల్ పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి.. లేడీ సూపర్ స్టార్ గా ఈమె ప్రేక్షకుల చేత పిలిపించు కుంటుంది.. ఈ పేరుతోనే అర్ధం అవుతుంది ఈమె ఎంత ఎత్తుకు ఎదిగిందో.. నయనతార ముందు నుండి నటన పరంగా అద్భుతమైన అభినయాన్ని కనబరుస్తుంది.
ఏ పాత్రలో అయిన ఈమె తన నటనతో కట్టి పడేసే సత్తా కలిగి ఉంది.. ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. అందుకే ఈమెకు అంత డిమాండ్.. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న ఈమె అందం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.. ప్రజెంట్ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటు దూసుకు పోతుంది.
సౌత్ లో అగ్ర హీరోయిన్ గా దూసుకు పోతున్న ఈమె కెరీర్ సూపర్ హిట్ గా సాగుతున్న వ్యక్తిగతంగా మాత్రం ఈమె ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది.. ఎందుకంటే ఈమె గతంలో చాలా మందితో డేటింగ్ చేసింది. అందులో ముఖ్యంగా శింబు, ప్రభుదేవా పేర్లు మాత్రం బాగా వినిపిస్తాయి.. అయితే ఇప్పుడు మాత్రం మరొకరి పేరు వినిపిస్తుంది.
ఆయన ఎవరో కాదు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూనే నటుడిగా కూడా రాణిస్తున్నారు. ఈ స్టార్ చాలా కాలంగా నయనతారతో డేటింగ్ చేస్తున్నాడు అని బీజేపీ నేత రవి చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.. వీరి ఎఫైర్ బయట పెట్టినందుకు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసారని ఈయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.