31.5 C
India
Sunday, May 12, 2024
More

    Team India Secret : టీమిండియా జోరుకు కారణమదేనా..? హ్యార్దిక్ పాండ్యా సీక్రెట్ చెప్పేశాడా..?

    Date:

    Team India Secret
    Team India Secret, World Cup 2023

    Team India Secret : వరల్డ్ కప్ లో మంచి జోరు మీదున్న జట్లలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. మొదటి మ్యాచులోనే ఆస్ర్టేలియా కంగుతినిపించి, ఆ తరువాత వరుసగా అప్గానిస్థాన్, పాకస్థాన్ జట్లపై గెలిచి ఊపు మీద ఉంది. ఈ క్రమంలో టీమిండియా సక్సెస్ కు కారణమేంటో టీమిండియా ఆల్ రౌండర్  హ్యార్దిక్ పాండ్యా వివరించాడుజ

    మూడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచిందీ జట్టు. ఈ క్రమంలోనే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల మాట్లాడుతూ టోర్నీలో తమ గెలుపు రహస్యాలను వివరించాడు. తమ జట్టులోని 11 మంది సమష్టిగా కలిసి నడుస్తున్నట్లు చెప్పాడు. డ్రెస్సింగ్ రూంలో మేం 11 మంది సభ్యులం ఆహ్లాదంగా ఉంటున్నాం. మా చిన్ననాటి ఫొటోలు చూస్తూ సరదాగా గడుపుతున్నాం. మేమంతా కలిసి ఒక జట్టులా ఆడుతున్నాం అని పాండ్యా వివరించాడు. అయితే ఈ టోర్నీలో పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు.

    అసీస్ తో జరిగిన తొలి మ్యాచులో మాత్రమే బ్యాటింగ్  చేసిన అతను 8 బంతుల్లో 11 పరుగులతో నిలిచాడు. ఇక ఆఫ్గాన్ , పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుల్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అదే సమయంలో బంతితో మాత్రం పాండ్యా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 6.56 ఎకానమీతో ఐదు వికెట్లు తీసుకున్నాడు.

    ఇక పూణె వేదికగా బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచులో కూడా పాండ్యా ఇదే జోరు కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో భారత్ ను కూడా ఇబ్బంది పెట్టిన జట్లలో బంగ్లా ముందు వరుసలో ఉంటుంది. ఆసియా కప్ లో కూడా అన్ని జట్లను మట్టికరిపించిన ఇండియా, బంగ్లా చేతిలో ఓడిపోయింది. ఇక ఈరోజు జరిగే మ్యాచులో బంగ్లాతో సమరానికి రోహిత్ సేన సిద్ధమైంది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...