37.8 C
India
Monday, May 13, 2024
More

    KTR : KCR అలా చేసుంటే మరోలా ఉండేది: KTR 

    Date:

     

    KTR and KCR
    KTR and KCR

    KTR : ట్విట్టర్ వేదికగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు తూటాల్లా పేలుతున్నాయి.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే బాగుండే దని ఆ ఛానెల్స్ ద్వారా  ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే వాళ్లం అని ఆయన ట్విట్ చేశారు. ఎన్నికల తర్వాత చాలా ఆసక్తికర మైన ఫీడ్ బ్యాక్, పరిశీలనలో నాకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపట్ల కొంత మంది బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపుతుండగా మరి కొందరు విమర్శిస్తున్నారు.  మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

    గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరగలేదని వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రం దివాళ తీసేలా అప్పటి పరిపాలన ఉందని కాంగ్రెస్ నేతలు రోజుకో విమర్శ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఏమాత్రం తగ్గకుండ  బిఆర్ఎస్ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు.

    కేటీఆర్ అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థు లపై ఆసక్తికర విమర్శలు చేస్తూ ముందుకు సాగు తున్నారు. సాధారణంగా ఎన్నికల ముందు ఇలాంటి వాతావరణం ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడి రాజకీయాలు ఇంకా వేడిగానే ఉన్నట్లు తాజా పరిస్థితిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.

    Share post:

    More like this
    Related

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....