25.2 C
India
Friday, June 28, 2024
More

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Date:

    Chandrababu vs jagan
    Chandrababu vs jagan

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలసి ఆయనను సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశించి పలువురు నేతలు కీలక నేతలు మాట్లాడారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ కౌరవ సభ నుంచి గౌరవసభగా మారిందని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఇక మీదట జరగనిచ్చే ప్రసక్తే లేదని ప్రస్తుత అధికార పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యులు ఇదే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. గతంలో వినిపించిన భాష, ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదని నిర్ణయించారు. దానికి అందరూ అంగీకరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా గౌరవసభ నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చారు.

    అంటే వైసీపీకి చెందిన పదకొండుమంది ఎమ్మెల్యేలు.. జగన్ తో సహా అందరూ సభకు వస్తే.. వారెవరికీ గతంలో వారు చేసిన వ్యవహారాలకు ప్రతీకారంగా అవమానాలు చేసే కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేశారు. సభలో ఉన్నంత కాలం ప్రజా సమస్యలపైనే చర్చిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై చర్చ జరుగుతుంది కాబట్టి.. తమ వాదన వినిపించుకునేందుకు వైసీపీ నేతలు కూడా ధైర్యంగా సభకు రావొచ్చని పిలుపు నిచ్చారు. అయితే అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న దానిపై జగన్ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్లిపోయిన ఆయన తీరు చూస్తే .. ఆయన ఈ ఐదేళ్లు సభకు వస్తారని భావించడం లేదు. కానీ ఆయన రావాలని అందరూ కోరుకుంటున్నారు. వాళ్లు వ్యవహరించినట్లుగా వ్యవహరించబోమని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV : ఆర్జీవీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

    RGV : ఆర్జీవీ (రాంగోపాల్ వర్మ) గురించి దేశ వ్యాప్తంగా పరిచయం...

    Ex CM Jagan : ఐదేళ్లు ఇలానే గడపనున్న మాజీ సీఎం జగన్..

    Ex CM Jagan Trolls : వై నాట్ 175 నుంచి...

    Pawan Kalyan : జగన్ అహం మీద కొట్టిన పవన్ కళ్యాణ్!

    Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన రాజధానిని నీనెందుకు కొనసాగించాలని...

    AP Politics : ఏపీలో అభివృద్ధి తక్కువ.. విధ్వంసం ఎక్కువ

    AP Politics : 2015లో ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టారు ఏపీలో....