33.5 C
India
Monday, June 24, 2024
More

    Kerala News : భర్తను అలా అనడం క్రూరత్వమే..

    Date:

    Kerala News
    Kerala News

    Kerala News : వివాహమనేది అనేది ప్రతిఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం. పెళ్లి తర్వాత పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని ప్రతి జంటా కోరుకుంటుంది. వివాహం తర్వాత దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే. అవి అప్పటికప్పుడు సమసిపోయేటివే. కొంతమంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం ముందుకు సాగుతుంటారు. కానీ మరికొందరు మనస్పర్థలు, గొడవల వల్ల మధ్యలోనే తమ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు. చివరాఖరకు విడాకులు తీసుకుంటారు. అలాగే ఇప్పటికీ కూడా పలు చోట్ల గృహ హింస కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భార్యను భర్త వేధించడం లేదా భర్తను భార్య వేధించడం లాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా భర్త  పట్ల ఓ భార్య వైఖరి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. భర్త నల్లగా ఉన్నాడంటూ వేధింపులకు పాల్పడడం ఈ చర్చకు దారితీసింది. చివరికి భార్య వేధింపులు తాళలేక భర్త కోర్టును ఆశ్రయించగా, న్యాయం స్థానం కూడా అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

    భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగితేనే సంసారం ముందుకు వెళ్తుంది. చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకుంటే ఆ దంపతుల పరువు కాస్త బజారున పడుతుంది. దంపతులు ఒకరినొకరు మానసిక వేదనకు గురి చేస్తే వాళ్ల జీవితం విడాకులకు దారి తీయక తప్పదు. భర్తను భార్య పదే పదే నల్లోడా అని అనడంతో సదరరు భర్త కోర్టును ఆశ్రయించాడు. ప్రతి సారి భార్య తనను కర్రోడా అనడాన్ని తట్టుకోలేకపోతున్నానని,  ఇబ్బందిగా ఉందని బాధితుడు కోర్టుకు విన్నవించాడు. ఈ మానసిక వేదన నుంచి తట్టుకోలేకపోతున్నానని భార్య నుంచి తనకు విడాకులు కావాలంటూ కోర్టుకు విన్నవించాడు. హిందూ వివాహ చట్టం ప్రకారం భర్తను నల్లోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్ధతిన మానసింగా, శారీరకంగా, భావోద్వేగాలపైనా ప్రభావం పడుతుందని కోర్టు తెలిపింది. భర్తను మానసిక వేదనకు గురి చేసిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్తను అలా వేధధించడం క్రూరత్వంగా కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.

    Share post:

    More like this
    Related

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Auspicious Moments : జూన్, జులై రెండు నెలల్లో శుభ ముహూర్తాలు ఇవే..

    Auspicious Moments : ఏ కార్యం చేపట్టాలన్నా మంచి రోజు, మంచి...

    Uttar Pradesh : పెళ్లి జరుగుతుండగానే వధువుకు వరుడి ముద్దు.. ఇరు కుటుంబాల ఘర్షణ

    Uttar Pradesh : కళ్యాణ వేదికపై పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగానే అందరిముందే...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...