29.3 C
India
Wednesday, June 26, 2024
More

    Joe Biden : స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన జో బైడెన్.. బయటకు తీసుకెళ్లిన ఒబామా

    Date:

    Joe Biden
    Joe Biden

    Joe Biden : దేశాధ్యక్షులు, ప్రధానులు అంటే ఎలా ఉండాలి.. ఆ దేశానికి సంబంధించి రిప్రజంటేషన్ వారే కాబట్టి ఎప్పటికీ అలర్ట్ గా ఉండాలి. యాక్టివ్ గా ఉంటూ తమ దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలి. కానీ బైడెన్ వ్యవహారం రోజుకోమాదిరిగా తయారవుతోంది. మొన్నటికి మొన్న ఇటలీలో జరిగిన G7 సదస్సులో ఆయన వ్యవహరించిన తీరు కొంత ఇబ్బంది పెట్టింది. వివిధ దేశాధి నేతలు ఒక వైపున ఉంటే బైడెన్ మరో వైపునకు వెళ్తున్నాడు.. సరే అక్కడ ఏమైనా పనుందా? అంటే అటు వైపు ఎవరూ లేరు. ఇటలీ ప్రధాని మెలోని వారించి తీసుకుచ్చింది. దీనికి వయోభారం కూడా కారణం కావచ్చు.

    బైడెన్ వయోభారం గురించి తరుచూ చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆయన వింత ప్రవర్తనే. దారితప్పడం, గందగరోళ చూపులు, స్టేజీపై బిగుసుకుపోవడం వంటివి అందుకు ఉదాహరణ. రీసెంట్ గా మరోసారి అదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో పక్కనే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు.

    లాస్‌ ఏంజిల్స్‌లో శనివారం (జూన్ 15) డెమోక్రాటిక్‌ పార్టీకి సంబంధించి విరాళాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలోబైడెన్‌, ఒబామా పాల్గొన్నారు. వారిని జిమ్మీ కిమ్మెల్‌ 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా డెమోక్రాటిక్ మద్దతుదారులు చప్పట్లతో మార్మోగించారు. దీంతో నేతలిద్దరూ వారికి అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీపై నుంచి వెళ్లేందుకు ముందుకు కదిలారు. బైడెన్‌ మాత్రం దాదాపు 10 సెకన్ల పాటు బిగుసుకుపోయినట్లుగా ఉన్నారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

    ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైడెన్‌ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన భార్య జిల్‌ బైడెన్‌ మాత్రం బైడెన్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, బాగానే ఉన్నారని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. 81 ఏళ్ల వయసులో ఆయన వయోభారం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అన్న అనుమానం అమెరికన్లలో కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahavir Ambition : మహావీర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..

    Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి...

    Donald Trump : న్యూయార్క్ కోర్టులో ట్రంప్ కు 4  లక్షల డాలర్ల జరిమానా

    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు...

    Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ ఔట్?

    Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్...

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్ వివరాలు ఇవే..

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్‌ ను అమెరికా ప్రభుత్వం...