28.3 C
India
Monday, July 1, 2024
More

    Prabhas : ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ పై ప్రభాస్ సరికొత్త రికార్డు

    Date:

    Prabhas Records
    Prabhas Records

    Prabhas : ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ ఒకటి. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి స్టార్లు నటించిన ఈ చిత్రం ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవబోతున్నది. తొలి రెండు రోజులు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి  శని, ఆదివారాలు కూడా కలిసి రానున్నాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 1000 కోట్లు సాధించడం పక్కా అని ప్రభాస్ అభిమానులు పేర్కొంటున్నారు.

    ఇక మరోవైపు  విదేశాల్లోనూ కల్కి మూవీ తుఫాన్ సృష్టిస్తున్నది. రెస్టాఫ్ ఇండియాలోనూ భారీగా కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. . కల్కి 2898 AD మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది, సుదీర్ఘ బాక్సాఫీస్ కరువుకు తెరదించింది.  ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ వెల్లడయ్యాయి. ఇండస్ట్రీ ట్రాకర్ సక్ నిల్క్ డాట్‌కామ్  కల్కి 2898 AD మొదటి రోజు కలెక్షన్ విడుదల చేంది. భారతదేశంలో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, కల్కి 2898 AD మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191 కోట్లు వసూలు చేసింది.  కేవలం భారతదేశంలో మొదటి రోజు దాదాపు రూ. 95 కోట్లు రాబట్టింది. శని,ఆదివారాలు కలిసి రానుండడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

     ఐదు సినిమాలతో అగ్రస్థానంలో ప్రభాస్..

    మొదటి రోజు వంద కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఐదు చిత్రాలు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. ‘కల్కి 2898 ఏడి'(191 కోట్లు) ‘సాలార్’ (రూ. 178 కోట్లు), ఆదిపురుష్(140 కోట్లు) సాహో (రూ. 130 కోట్లు), బాహుబలి-217 కోట్లు కొల్లగొట్టిన హీరోగా ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఈ ఫీట్ ఇప్పటి దాకా ఎవరూ సాధించలేదు. బాలీవుడ్ స్టార్లను సైతం అధిగమించి ఒక సౌత్ హీరో ఈ ఫీట్ ను సాధించాడు.  ఈ లెక్కలు చూసుకుంటే ఇండియన్ బాక్సాఫీస్ బాస్ ప్రభాస్ అని చెప్పకతప్పదు.

    Share post:

    More like this
    Related

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related