Sankranti Movies 2024 : సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు మూడు, ఒకటి యంగ్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. అయితే దిల్ రాజు మాత్రం ‘గుంటూరు కారం’పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సైంధవ్, హను-మాన్ కు కూడా మోస్తరు థియేటర్లను కేటాయించారు. కానీ ఇప్పుడు దెబ్బ మాత్రం ఈ రూపంలో కాకుండా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ల రూపంలో వస్తుంది.
అయితే, ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి ప్రీ ఈవెంట్ ఫంక్షన్ ను ప్రొడ్యూసర్ 6వ తేదీ (శనివారం) ప్లాన్ చేశాడు. కానీ నిర్వహణకు పోలీస్ అనుమతి ఇవ్వలేదు. గుంటూరు కారం 6 చేస్తున్నారు కాబట్టి మనం 7వ తేదీ చేయాలని హను-మాన్ టీం ప్లాన్ చేసింది. ఇది హైదరాబాద్ లో జరగనుంది. దీనికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి రానున్నాడు. అదే రోజు (7వ తేదీ’ వెంకటేష్ సైంధవ్ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశాడు. అది విశాఖలో నిర్వహిస్తున్నాడు.
ఎవరి ఫంక్షన్లకు వారి వారి అభిమానులు వస్తారు ఇందులో ఎలాంటి సమస్య లేదు. కానీ ఈ ఫంక్షన్లన్నీ ఒకే సారి లైవ్ అవుతాయి. అటు టీవీ, ఇటు యూ ట్యూబ్ లో మహేష్-త్రివిక్రమ్ పై ఆసక్తి ఉంటుంది. అందువల్ల చానళ్లు దానికే ప్రియారిటీని ఇస్తాయి. యూ ట్యూబ్ అటే మొగ్గు చూపుతాయి. కానీ గుంటూరు కారంకు మరో అవకాశం లేదు. ఎందుకంటే 6వ తేదీ ప్లాన్ చేశారు. అనుమతి రాలేదు.. 8వ తేదీ (సోమవారం)కి వెళ్తే ఆ రోజు హాలిడే లేదు. 7వ తేదీనే చేసే అవకాశం ఉంది.
హను-మాన్, సైంధవ్ కు ఒకే ఒక అవకాశం ఉంది అదేంటంటే.. టైమ్ ను ముందుకు జరుపడం.. ప్రతి భారీ ఫంక్షన్ కు సుమ యాంకరింగ్ సెంటిమెంట్ గా ఉంటుంది. ఈసారి సుమ ఆ అవాకాశం హను-మాన్ కే ఇచ్చింది.