Sankranti Movies 2024 : ఈ ఏడాది సంక్రాంతి బరిలో చాలా సినిమాలు నిలుస్తు్న్నాయి. అందులో ముఖ్యమైనవి ‘గుంటూరు కారం’, ‘హను-మాన్’ ఉన్నాయి. అయితే గుంటూరు కారం రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ చేయగా.. ఆ టైం వరకు సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీని కోసం హను-మాన్ రిలీజ్ డేట్ మార్చుకోవాలని కోరుతున్నారు. ‘హను-మాన్’ పాన్ ఇండియా సినిమా కావడంతో నార్త్ లో రిలీజ్ కు ఎటువంటి అడ్డంకి లేదు. కానీ సౌత్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూవీ వాయిదా వేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం ససేమీరా అంటున్నారు.
‘గుంటూరు కారం’ విడుదలైన మొదటి రోజే ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో నిర్మాతలు ఉన్నారు. టిక్కెట్ ధరలను పెంచడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న స్క్రీన్‌లన్నింటినీ ఆక్రమించుకోవడం వంటి వాటితో సహా మొదటి రోజు గణనీయమైన ఓపెనింగ్‌ను ఉండేందుకు మేకర్స్, థియేటర్ నిర్వాహకులు ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు.
అదే రోజు (జనవరి 12) ‘హను-మాన్’ విడుదలైనప్పటికీ, ‘గుంటూరు కారం’కు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లను కేటాయించాలని ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేస్తున్నారు. జనవరి 13 నుండి తమ సినిమా ఇతర రిలీజ్‌లతో స్క్రీన్‌లను షేర్ చేసుకోవాల్సి రావడంతో మహేష్ బాబు సినిమా మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో, నిర్మాతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో టిక్కెట్ ధరలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి రోజు నైజాంలో తమ సినిమాకు ‘సలార్’ ఓపినింగ్స్ వస్తాయని నిర్మాతలు ఎదురు చూస్తున్నారని సమాచారం.