34.1 C
India
Monday, June 17, 2024
More

    Teacher Suspension : స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడని టీచర్ సస్పెన్షన్

    Date:

    Teacher Suspension
    Teacher Suspension

    Teacher Suspension : స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని ఓ టీచర్ ను సస్పెన్షన్ చేశారు. ఏపీ విజయవాడలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్ఆర్కే ఉన్నత పాఠశాలలో ఎ. రమేశ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా ఆయన స్కూల్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన మెసేజ్ లను పట్టించుకోవడం లేదు. వాట్సాప్ గ్రూపు నుంచి కూడా వెళ్లిపోయాడు. దీని గురించి అడిగినప్పటికీ సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో రమేశ్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    అయితే, దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తనకు కంటి సంబంధిత సమస్య ఉందని.. స్మార్ట్ ఫోన్ వాడొద్దని వైద్యులు చెప్పారని రమేశ్ వివరణ ఇచ్చినప్పటికీ, పర్సనల్ విషయాన్ని సాకుగా చూపించి సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సహాయ సంచాలకులు రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు.

    కాగా, ఈ వివాదంపై డీఈవో యూవీ సుబ్బారావు స్పందించారు. కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని రమేశ్ ను అడిగామని, అయినా ఆయన స్పందించలేదని తెలిపారు. అంతేకాకుండా విధి నిర్వహణలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని డీఈవో వివరించారు.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Visakhapatnam : విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఘన స్వాగతం

    Visakhapatnam : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంతి అచ్చన్నాయుడులకు విశాఖలో...

    Great Andhra : అప్పుడేమో విషపు రాతలు..ఇప్పుడేమో ధీరోదాత్తుడు అంటూ పొగడ్తలు..ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఇదేనేమో

    Great Andhra : నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...