29.2 C
India
Thursday, July 4, 2024
More

    Team India : బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన టీం ఇండియా ఆటగాళ్లు.. తుఫాన్ తగ్గితేనే ఇండియాకు

    Date:

    Team India
    Team India

    Team India : టీ20 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజు నుంచి బార్బడోస్ లో తుఫాను బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీం ఇండియాలోని ప్రతి క్రికెటర్, వారి కుటుంబ సభ్యులు ఇంకా అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్ లో తుఫాన్ కారణంగా విద్యుత్, నీటి సరఫరా కూడా నిలిచిపోయినట్లు సమాచారం. అయితే ఎయిర్ పోర్టును కూడా మూసివేయడంతో క్రికెటర్ల తో పాటు సపోర్టు స్టాప్ అంతా కలిసి అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 70 మంది వరకు బార్బడోస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.  బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్‌ నుంచి బయట పడేసేందుకు ఫ్లాన్ వేసినట్లు సమాచారం.

    అయితే టీం ఇండియాను ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారా రప్పించేందుకు జై షా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తుఫాన్ లో చిక్కుకుపోయిన టీం ఇండియా సభ్యులను ఇండియా చేర్చేందుకు అన్ని రకాల సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే కాస్త తుఫాన్ ప్రశాంతిస్తే టీం ఇండియా జట్టు సభ్యులను ఇండియా తీసుకురానున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ప్రకృతి తో పోరాడే కంటే వేచి ఉండడమే మంచిదని ఆయన అన్నారు. ముఖ్యంగా తుఫాన్ ఎక్కువగా ఉన్న కారణంగా ఏమీ చేయలేకపోతున్నాం.. ఎయిర్ పోర్టు తెరవగానే చార్టర్డ్ ఫ్లైట్ లలో జట్టు సభ్యులను ముందుగా అమెరికా, యూరప్ చేర్చుతాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు జైషా చెప్పారు. కొంత సంయమనం తప్పకుండా అవసరమని ఆయన అన్నారు.

    టీం ఇండియా జట్టు సభ్యులకు హోటళ్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తుఫాన్ కారణంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. టీం ఇండియా ప్రపంచకప్ గెలవగానే మరుసటి రోజు నుంచి బార్బడోస్ ను వర్షం ముంచెత్తింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి తుఫాన్ గా మారిపోయింది.

    Share post:

    More like this
    Related

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి....

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    Bihar : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

    Bihar : బ్రడ్జి కడితే నాలుగు తరాలు ఉండాలంటారు. కానీ, బీహార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    World Champions : విజయ యాత్రకు సిద్ధమైన వరల్డ్ చాంఫియన్లు

    World Champions : టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్...

    Rohit Sharma : రోహిత్ తర్వాత ఇండియా కెప్టెన్ ఎవరూ?

    Rohit Sharma : రోహిత్ శర్మ తర్వాత టీం ఇండియా కెప్టెన్...

    Team India : హరికేన్ ఎఫెక్ట్.. బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీం ఇండియా

    Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు...