25.2 C
India
Monday, July 1, 2024
More

    Telangana : తెలంగాణలో అధికార మార్పిడి ఖాయమేనా?

    Date:

    Telangana :
    తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో పార్టీల్లో రాజకీయ వేడి మొదలైంది. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో అలజడి మొదలైంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.
    లోక్ సభ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉండగా వాటికంటే ముందే శాసనసభ ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇందులో చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మిగతా చోట్ల బీజేపీ ఉంది. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మూడోసారి గెలవాలని తాపత్రయ పడుతోంది. కానీ దాని ఆశలు అడియాశలే కానున్నాయని సర్వేలన్ని ఘోషిస్తున్నాయి.
    ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నారు. మోడీ చరిష్మాతో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని చెబుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే ధోరణిలో ఉన్నాయి. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి.
    సీ ఓటరు సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ కు ఉన్న ఏడు సీట్లలో మూడు గెలుస్తుందని అంచనా వేస్తోంది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంటుంది. ఈసారి బీఆర్ఎస్ కు భంగపాటు ఎదురు కానుంది. ఈ మేరకు సర్వేలు కోడై కూస్తుండటంతో కేసీఆర్ లో అంతర్మథనం నెలకొంటోంది. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అనే వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    DK Shivakumar : కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. జగన్ ను నేను కలవలేదన్న డీకే శివకుమార్

    DK Shivakumar :  ఏపీ రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులుగా ఓ...

    AP CM Chandrababu : ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ అందజేసిన సీఎం, ఐటీ మినిస్టర్..

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా...

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    KCR : విద్యుత్‌ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

    KCR : తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...