32 C
India
Sunday, June 30, 2024
More

    Maadhavi Latha : ఆ హీరోయిన్ ఆ ఎమ్మెల్యే తాలుకానట? 

    Date:

    Maadhavi Latha
    Maadhavi Latha

    Maadhavi Latha : ఏపీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమికే మొగ్గు చూపాయి. ప్రధానంగా ఏపీలోని కొన్ని నియోజకవర్గాలపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై అందరి దృష్టి ఉంది. ఇక ఇదే సమయంలో  తెలుగు హీరోయిన్ మాధవి లత  ఆసక్తికర కామెంట్లు చేసింది.

    ఏపీ ఎన్నికల్లో  హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గాల్లో పవన్ కల్యాన్ పోటీ చేస్తున్న  పిఠాపురం ఒకటి. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణం. అక్కడ ఓటు వేసి జనసేనానిని గెలిపించేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు ముందుకు వచ్చారు.

    ఎన్నికలు ముగిసిన తర్వాతా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. ఇందుకు కారణం అక్కడ గెలిచేది పవన్ కల్యాణే అని రిపోర్టులు వెల్లడి  కావడమే. ఇక జనసేన కార్యకర్తలు మరింత ఉత్సాహంగా తమ వాహనాలకు ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే నంబర్ ప్లేట్లు తయారు చేసుకోవడం గమనార్హం.

    ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే నెంబర్ ప్లేట్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ మాధవి లత దీనిపై స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే నెంబర్ ప్లేట్ బోర్డు ఫొటోను షేర్ చేయడం ఆసక్తిని రేపింది. అంతేకాదు, ‘మీరు కూడానా’ అంటూ తన ఫాలోవర్లను కూడా  ప్రశ్నించింది.
    మాధవి లత షేర్ ఈ ఫొటో చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఇక, ఆమె చేసిన పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు కూడా మాధవి లతకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, వైఎస్సార్ సీపీ వీరాభిమానులు మాత్రం మాధవితలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    మాధవి లత చాలా కాలం గత ఎన్నికల సమయంలోనే  బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలతో పాటు సామాజిక అంశాలపై పాలక పక్షాలపై ప్రశ్నలు సందిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    Suryakumar Yadav : కప్పు తెచ్చిన క్యాచ్.. కపిల్ ను గుర్తు చేసిన సూర్య

    Suryakumar Yadav : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Allu Aravind : ‘పవన్ మా వాడు’ అంటున్న అల్లు అరవింద్.. అప్పుడలా ఇప్పుడిలా..?

    Allu Aravind : ‘బెల్లం చుట్టూ ఈగలు’ సామెత అక్షర సత్యం....

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...